శివాజీ వ్యాఖ్యలపై.. నాగబాబు ఫైర్..!
నాగబాబు మాట్లాడుతూ.. నేను ఒక రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా, ఒక కుటుంబ వ్యక్తిగా మాట్లాడలేదు.. ఒక సాధారణ మనిషిగా ఈ విషయం పైన మాట్లాడుతున్నానని తెలిపారు. శివాజీ అనే వ్యక్తి నా టార్గెట్ కాదు. ఒకవేళ నేను మాట్లాడే మాటలు వారినే టార్గెట్ చేశాయి అనుకుంటే ఏమి చేయలేను అంటు.. శివాజీ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. మన సమాజంలో ఇప్పటికీ పురుషాధిక్య ఆలోచనలు ఎక్కువగా నడుస్తున్నాయని మహిళలు మోడరన్ డ్రస్ ధరించడం తప్పుకాదాని, ప్రపంచంలో ఫ్యాషన్ అనేది ఎన్నో రకాలుగా ఉంటుందని తెలిపారు. మహిళలను కట్టడి చేయడం కంటే రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే మంచిదని సూచించారు. ఆడపిల్లల పైన అత్యాచారాలు కేవలం వారు వేసుకొనే దుస్తుల వల్ల కావడం లేదు. మగాళ్ళ కురువత్వం వల్లనే జరుగుతున్నాయని తెలియజేశారు నాగబాబు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరి ఈ విషయం పైన నటుడు శివాజీ ఏ విధమైనటువంటి సమాధానం చెబుతారో చూడాలి మరి. ఇప్పటికే శివాజీ కూడా ఈ వివాదానికి ఇకమీదట పుల్ స్టాప్ పెట్టాలి అంటూ ఒక వీడియోని కోరారు. అయినా కూడా ఈ విషయం మీద ఎక్కడో ఒకచోట ఏదో ఒక విషయం వైరల్ గా మారుతోంది.