అసలే రెచ్చిపోతున్న రష్యాకు ఇప్పుడు హమాస్ కూడా తోడైందా?
దీనకి సంబంధించి రష్యా రక్షణ మంత్రి పెద్ద ప్రకటన చేశారు. రష్యా సరిహద్దుల్లో 12300 నాటో సైనికులు ఉన్నారని తెలిపారు. ప్రమాదాన్ని చూసి రష్యా కూడా సన్నాహాలు పూర్తి చేసింది. నాటో సవాల్ ను ఎదుర్కొనేందుకు, మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ ప్రాంతాలను కూడా సైనిక జిల్లాలుగా అభివృద్ధి చేస్తున్నారు. తద్వారా ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ఇటీవల నాటో సభ్యులు ఫ్రాన్స్, జర్మనీ, లిథువేనియాలో యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి.
ఈ సమయంలో రష్యా సంచలన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. తమ సైనిక శక్తిని పెంపొందించేందుకు హమాస్ తో చేతులు కలిపేందుకు సిద్ధమైందనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రష్యా తీవ్ర వాద సంస్థలైన వాగ్నర్, చచన్ గ్రూపులను తమ ప్రైవేట్ సైన్యంగా నియమించుకుంది. దీనిని పుతిన్ ప్రైవేట్ సైన్యంగా పలువురు అభివర్ణిస్తుంటారు. వీరికి పుతినే ఆయుధాలను సరఫరా చేస్తుంటారు.
తమకు ఎదురొచ్చే వారిని ఈ సైన్యం ద్వారా నియంత్రించడం.. వివిధ దేశాల్లో అల్లకల్లోలం సృష్టించడం పుతిన్ పని. ఈ తర్వాత వాగ్నర్ గ్రూపు ఏకు మేకై కూర్చొంది. యుద్ధం సమయంలో వాగ్నర్ చీఫ్ పుతిన్ పైనే కాలు దువ్వారు. అప్పుడు చర్చలతో ఆయన్ను శాంతింపజేశారు. కానీ ఆ తర్వాత అతను విమాన ప్రమాదంలో మరణించడం వెనుక పుతిన్ ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. యుద్ధం ముదురుతున్న కొద్దీ కొత్త తీవ్రవాదుల అన్వేషణలో భాగంగా హమాస్ కి స్నేహ హస్తం అందించేందుకు రెడీ అయ్యారు. వారితో చర్చలు జరుపుతున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.