నరాల బలహీనత తగ్గాలంటే దీన్ని తినాల్సిందే?

Purushottham Vinay
చాలా మంది నరాల బలహీనత సమస్యతో బాధ పడుతూ ఉంటారు. ఈ సమస్యకు బెండకాయలు బాగా పని చేస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, మేధాశక్తి, చురుకుదనం పెరుగుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. మనలో చాలా మంది బెండకాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అయితే బెండకాయలను నూనెలో వేసి డీప్ ప్రై చేయడం వల్ల వాటిలో ఉండే పోషకాలు నశిస్తాయి. కనుక వీటిని తక్కువ నూనెలో ఉడికించి తీసుకోవడం మంచిదని అప్పుడే వీటి వల్ల కలిగే ప్రయోజనాలను మనం పొందగలుగుతామని నిపుణులు చెబుతున్నారు.మన శరీరంలో నరాల కణాలు అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మెదడు నుండి సమాచారాన్ని అవయవాలకు, అలాగే అవయవాల నుండి సమాచారాన్ని తిరిగి మెదడుకు అందిస్తూ ఉంటాయి. శరీరంలో సంకేతాలను అందించడంలో, మనం పనులు చేసుకోవడంలో, అవయవాలను కదిలించడంలో ఇలా అనేక ముఖ్యమైన విధులను నరాల కణాలు నిర్వర్తిస్తాయి. కనుక నరాల కణాలను దెబ్బతినకుండా, నశించకుండా కాపాడుకోవాలి.నరాల కణాలు మరియు నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా, ఇవి చురుకుగా పని చేయాలన్నా మనం బెండకాయలను ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.


నరాల కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో బెండకాయ చక్కగా పని చేస్తుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. బెండకాయలో ఉండే పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు నరాల కణజాలాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి దెబ్బతినకుండా కాపాడడంలో, కణాలల్లో వచ్చిన ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో,నరాల కణాల జీవితకాలాన్ని పెంచడంలో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. మెదడు ఎక్కువ కాలం చురుకుగా పని చేయాలన్నా, నాడీ వ్యవస్థ చురుకుగా పని చేయాలన్నా బెండకాయలను తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.మన శరీరం అనేక కణాలతో ఏర్పడుతుంది. ఈ కణాలు కొన్ని వాటి వయసు దాటి పోవడం వల్ల కొన్ని దెబ్బతినడం వల్ల చనిపోతూ ఉంటాయి. అలాగే చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు తిరిగి పుడుతూ ఉంటాయి. ఈ విధంగా మన శరీరం నిర్మించబడింది. కానీ మన శరీరంలో రెండు కణాలు మాత్రం చనిపోతే మరలా పుట్టవు. అలాగే ఇవి దెబ్బతిన్నా కూడా తిరిగి బాగుకావాలంటే బెండకాయ ఖచ్చితంగా తినాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: