నలభైయేళ్ల అనుభవమున్న బాబు ప్రభుత్వం రాష్ట్రంలో మాఫియాలను నిలువరించలేదా?

ముఖ్యమంత్రి అనే వారు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి. మరీ నాలుగు దశాబ్ధాల అనుభవమున్నవారైతే  అత్యద్భుత పాలన ఇవ్వాలి. పొరపాటున తప్పులు జరిగితే తన పెద్దరికం ఉపయోగించి దాన్ని సరిదిద్దాలి. తన నీతి, నిజాయతీ, ఋజుప్రవర్తనని చూపించి ఈతరులను సన్మార్గంలో నడవమని నిర్దేసించే స్థాయిలో ఉండాలి. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన ప్రజలకు ఆదర్శంగా నిలవగలిగే గుణం ఒక్కటిలేక పోగా అందరి చేతా తన తప్పులను ఎత్తిచూపించబడటానికి కావలసినన్ని తప్పుల చేసి తప్పుల కుప్ప ఐపోయారు. ఉదాహరణగా క్రింద ఉదహరించిన కొన్ని విషయాలు చాలు కదా! 


*బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడ్డ ప్రజలకు చాలా జాబులు పోగొట్టి తనకొడుక్కి చక్కని జాబు ఇచ్చేశారు.

*సినీ నటుడు తన బామ్మర్ధి సినిమాకు వినోదపు పన్ను రద్దు చేయించారు.

*బంగారు నందులు అన్నీ తన కుల వర్గాలకే దక్కించేసుకున్నారు. ఆఖరికి కమిటీ నిండా తనవాళ్ళనే నింపేశారు.

*ప్రజా ధనాన్ని వందల నుండి వేల కోట్లలో అమరావతి శంఖుస్థాపనలకు ధార పోశారు. 


*పుష్కరాలకు, అమరావతికి నమూనాలు ఎంపిక చేయటానికి మందీ మార్బలంతో చేసిన విదేశీ యాత్రలకు ఖర్చు చేసిన వేలకోట్లు ధనంతో అమరావతిని నిర్మించటం   ప్రారంభించినా అవసరాల మేరకు నిర్మాణాలు పూర్తయ్యేవి.

*అమరావతి నిర్మాణానికి నమూనాల కోసం విశ్వప్రఖ్యాత మాకీ ఆసోసియేట్స్ లాంటి నిర్మాన సంస్థల అనుభవజ్ఞులను ఒక సిని దర్శకుని ముందు కూర్చోబెట్టారు.

*అమరావతి అనబడే అద్భుత నగరం నిర్మాణానికి ముందే దాన్ని కులాల కురుక్షేత్రం చేశారు. ఇలాంటి పునాది ఉన్న ఆ నగరం విశ్వనగరం అవ్వటం కల్ల. 




*రాష్ట్రమంతా ఇసుక, రెడ్ శాండల్, మైనింగ్, కల్తీ, మధ్యం, భూకబ్జా, విద్యా, కాల్ మనీ, సెక్స్ రాకెట్ల మాఫియాలకు ఆలవాలమైందని, స్త్రీలకు పసిపాపలపై అత్యాచారాలకు నిలయమై వారికి నివాస యోగ్యం కాకుండా పోతుందని ఇందులో అధికార టిడిపి కార్యకర్తలదే అగ్రతాంబూలమని ప్రజలంటున్నారు.

*ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన 600 వాగ్ధానాల్లో 60 వాగ్ధానాలు కూడా అమలులోకి రాలేదని ఎక్కడ చూసినా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 



చివరకు మిత్రులతో, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పొసగక, ఇప్పుడు వారిని శత్రువులుగా మార్చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్రం నుండి ఎలాంటి ప్రయోజనాలు రాష్ట్రానికి అందని పరిస్థితులు ఏర్పడ్డాయి. తన వైషమ్యం స్వార్ధం పరాకాష్టకు చేరగా ప్రజలకు విలువైన ఒక ప్రణాళికా కాలం వ్యర్ధ మయ్యేలా చేసి మరోసారి అధికారంలోకి రావటానికి ప్రయత్నించటం సిగ్గుపడేలా చేస్తుంది.



చంద్రబాబు నాయుడు తనపై చేసిన విమర్శలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం తిప్పికొట్టారు. ఉత్తరాంధ్ర ప్రజలను తాను రెచ్చగొడుతున్నానని చంద్రబాబు అంటున్నారని, రెచ్చగొట్టేవాడినైతే చంద్రబాబుకు ఎందుకు మద్దతిస్తానని ఆయన అన్నారు. 


విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయన తన పోరాటయాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కొందరు రాజకీయ నేతల చేతుల్లో ఉత్తరాంధ్ర నలిగి పోతుందని అన్నారు. గత ఎన్నికల్లో 70సీట్లకు పోటీ చేద్దామని తాను అనుకున్నానని, బాబుకు అనుభవం ఉందనే ఉద్దేశంతోనే తాను గత ఎన్నికల్లో నరెంద్ర మోడీకి, చంద్రబాబుకు మద్దతిచ్చానని అన్నారు. టీడీపి అవినీతికి చీపురుపల్లి మాంగనీసు గనులే నిదర్శనమని అన్నారు. చంద్రబాబు 40ఏళ్ల అనుభవం ఇసుక మాఫియాను ప్రోత్సహించడానికి పనికి వచ్చిందని ఆయన అన్నారు. 




ఇసుక రవాణా ఉచితమని చెప్పి అవినీతికి చట్టబద్ధత కల్పించారని ఆయన విమర్శించారు. ఇసుక మాఫియాను అరికట్టకపోతే 2050నాటికి నదులు ఉండవని అన్నారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని, తెలంగాణకు ఆస్థులు ఆంధ్రకు అప్పులు వచ్చాయని ఆయన అన్నారు.




అధికార దాహంతో టీడీపీ నేతలు కనిపించిన ప్రతి దాన్ని కబ్జా చేస్తూ అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా తో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని  విమర్శించారు. అధికార పార్టీ నేతలకు దోచుకోవడం తప్ప వేరే వ్యాపకం లేదని వ్యాఖ్యానించారు. జనసేన  ప్రజా పోరాట యాత్ర లో భాగంగా  గజపతినగరం లో శుక్రవారం సాయంత్రం జరిగిన సభలో మాట్లాడారు.




పర్యావరణ అనుమతులకు పూర్తి  విరుద్ధంగా ముఖ్యమంత్రి నివాసమే ఉంటే నేఱగాళ్లను ఎలా నియంత్రిస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి  కోసం పలు నివాసాలు అటు హైదరాబాద్ లోను ఇటు అమరావతిలోను కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి ఏర్పరచుకున్నారని అంటూ, నివాసాలకు రూ.కోట్లు ఖర్చు పెడుతూ  ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేస్తున్నారని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: