ప్రభాస్... హను రాఘవపూడి కాంబో మూవీ స్టార్ట్ అయ్యేది అప్పటినుండే..?

MADDIBOINA AJAY KUMAR
ప్రభాస్ హీరోగా హను రాగవపూడి దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమా ఓకే అయిన విషయం మన అందరికీ తెలిసిందే. చాలా రోజుల క్రితమే హను రాఘవపూడి ఓ కథను ప్రభాస్ కి వినిపించగా ... అది అద్భుతంగా నచ్చడంతో ప్రభాస్ వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , దానితో ఆయన దానిని మరింత అద్భుతమైన రీతిలో మలచడానికి ప్రీ ప్రొడక్షన్ పనులను ఎప్పటి నుండో ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే గత కొన్ని రోజుల క్రితమే ప్రభాస్ మూవీ కి సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ ను కూడా హను స్టార్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఇక ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావడానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... మరో రెండు నెలల్లో ప్రభాస్ , హను రాఘవపూడి కాంబో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేసిన తర్వాత చాలా స్పీడ్ గా ఈ మూవీ కి సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయాలి అని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసే పనులు ఈ సినిమా దర్శకుడు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ప్రభాస్ హీరోగా నటించనుండడం ... సీత రామం లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత హను రాగవపూడి దర్శకత్వం వహించే సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది  ఇక ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడి , రాజా సాబ్ మూవీ లలో హీరో గా నటిస్తున్నాడు. ఈ రెండు మూవీ ల షూటింగ్ లు ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: