టీవీ: క్యాస్టింగ్ కౌచ్ పై అనసూయ షాకింగ్ కామెంట్స్..!
అనసూయ ఎలాంటి విషయాన్ని అయినా సరే ముక్కు సూటిగానే తెలియజేస్తూ ఉంటుంది.తన వద్ద ఎవరైనా సరే పరోక్షంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే తన రియాక్షన్ కూడా ఎలా ఉంటుందో అనే విషయంపై ఇప్పటికే ఎన్నోసార్లు తెలియజేసింది.. ముఖ్యంగా సినిమా విషయంలో ఎవరైనా మాట్లాడానికి వచ్చినప్పుడు వారు ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారని విషయాన్ని కేవలం 3 నిమిషాలలోనే అర్థం చేసుకోవచ్చంటూ తెలియజేస్తోంది. అలా వారు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారనే విషయాన్ని గ్రహించిన తర్వాత తన భర్త పిల్లల గురించి తను మాట్లాడడం మొదలు పెడతానంటూ తెలియజేస్తోంది అనసూయ.
దీంతో వాళ్లు ఆ విషయం పైన కూడా డైవర్ట్ అవుతారంటూ వెల్లడించింది. మనం ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నప్పుడు మన ప్రయాణానికి చాలా అడ్డంకులు తేవాలని చాలా మంది చూస్తూ ఉంటారు.. ముఖ్యంగా మనం ఇండస్ట్రీలో సాఫీగా సాగాలి అంటే ఎవరితోనూ ఎలాంటి విభేదాలు పెట్టుకోకూడదని సున్నితంగానే మాట్లాడించి పంపించాలని.. మనం ఫ్యూచర్ గురించి ఆలోచించి వారు ఎదురైనప్పుడు కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని అనసూయ వెల్లడిస్తోంది. మొత్తానికి క్యాస్టింగ్ కౌచ్ పైన తన మనసులో మాటని బయట పెట్టేసింది అనసూయ. ప్రస్తుతం అనసూయ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. ఇవే కాకుండా మరో రెండు మూడు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నట్లు సమాచారం.