రాశి కన్నా పై ప్రశంసల వర్షం కురిపించిన తమన్నా..!

MADDIBOINA AJAY KUMAR
తమన్నా , రాశి కన్నా ప్రధాన పాత్రలలో తాజాగా "అరుణ్మనై 4" అనే తమిళ సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సుందర్ సి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని బాక్ అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన రాసి కన్నా , తమన్నా తెలుగు లో ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను కూడా మొదలు పెట్టారు. వీరిద్దరికీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉండడంతో వీరి ద్వారా ఈ మూవీ బృందం తెలుగులో ప్రచారాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క ట్రైలర్ ను విడుదల చేశారు. దానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ ప్రి రిలీజ్ ఈవెంట్ కు తమన్నా మరియు రాసి కన్నా కూడా విచ్చేశారు.

ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో భాగంగా తమన్నా మాట్లాడుతూ ... రాసి కన్నా పై ప్రశంసల వర్షం కురిపించింది. బాక్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా తమన్నా మాట్లాడుతూ ... ఇప్పటివరకు ఇండస్ట్రీ లో రాసి కన్నా లాంటి వ్యక్తిని తాను చూడలేదు అని చెప్పింది. తను చాలా నిజాయితీగా పనిబ్చేస్తుంది అన్నారు. మేమిద్దరం కలిసి గతంలో బెంగాల్ టైగర్ సినిమాకు పని చేశాం. ఇకపోతే దర్శకుడు సుందర్ ఎప్పుడు మహిళా పాత్రలకు మంచి ప్రాధాన్యత ఇస్తుంటారు .అది మీకు బాక్ ట్రైలర్ చూస్తేనే అర్థం అయి ఉంటుంది అని తమన్నా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: