ఆ డిజాస్టర్ మూవీ బ్యాక్ డ్రాప్ లో మరో మూవీ చేయనున్న విజయ్ దేవరకొండ..?

MADDIBOINA AJAY KUMAR
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన యువ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , టాక్సీవాలా , గీత గోవిందం సినిమాల విజయాలతో తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత నుండి ఈయన నోట , వరల్డ్ ఫేమస్ లవర్ , డియర్ కామ్రేడ్ , లైగర్ , ఖుషి తాజాగా ది ఫ్యామిలీ మెన్ సినిమాలతో వరుసగా 6 అపజయాలను అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డిలా పడిపోయాడు. ప్రస్తుతం విజయ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ విజయ్ కెరీర్ లో 12 వ మూవీగా రూపొందుతుంది. ఈ సినిమా తర్వాత విజయ్ , కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన రాజా వారు రాణి గారు సినిమాకు దర్శకత్వం వహించిన రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. ఇకపోతే ఈ మూవీ కి రౌడీ జనార్దన్ అనే టైటిల్ ను ఈ మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందినట్లు , ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మే 9 వ తేదీన విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో విజయ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన నోటా అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విజయ్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇలా నోట మూవీ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలో హీరోగా నటించి డిజాస్టర్ ను అందుకున్న విజయ్ మరోసారి అలాంటి బ్యాక్ డ్రాప్ సినిమాలోని నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd

సంబంధిత వార్తలు: