జగన్ కాకుండా కూటమికి చుక్కలు చూపించిన వ్యక్తి అతనే.. ఏం జరిగిందంటే?

Reddy P Rajasekhar
ఏపీలో జగన్ కాకుండా కూటమికి చుక్కలు చూపించిన వ్యక్తి ఎవరనే ప్రశ్నకు సీఎస్ జవహర్ రెడ్డి పేరు సమాధానంగా వినిపిస్తోంది. కూటమి అనుకూల మీడియా ఎన్ని కథనాలను ప్రచురించినా సీఎస్ జవహర్ రెడ్డిని మాత్రం కదిలించలేకపోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒక విధంగా జవహర్ రెడ్డికి షాకివ్వడానికి కూటమి చేసిన విఫల ప్రయత్నాలు అన్నీఇన్నీ కావనే చెప్పాలి.
 
కూటమి సర్వశక్తులు ఒడ్డినా వాళ్లతో పోల్చి చూస్తే తానే బలవంతుడినని జవహర్ రెడ్డి ప్రూవ్ చేసుకున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థల సహకారం కోసమే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని కూడా పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత దుష్ప్రచారం చేసి కొందరు అధికారులను ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడం ద్వారా మార్పించి పొత్తు ప్రయోజనాలు పొందాలని కూటమి నేతలు ఫిక్స్ అయ్యారు.
 
సీఎస్ జవహర్ రెడ్డిని మార్చాలంటూ సాక్షాత్తూ పురందేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. ఏపీలో కూటమి నేతలు చేసిన ప్రతి తప్పును సరైన సమయంలో ప్రచారం చేసి కూటమి ఎత్తులను జవహర్ రెడ్డి తిప్పికొట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఎస్ విషయంలో ఏం చేయలేక చివరకు కూటమి నేతలు చేతులు ఎత్తేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
సీఎస్ జవహర్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే ఆయన విషయంలో ఎన్ని కుట్రలు చేసినా వర్కౌట్ కాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఫేక్ ఎగ్జిట్ పోల్స్ ను ప్రచారం చేసుకుంటూ టీడీపీ పరువు పోగొట్టుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతలు ఎన్నికల్లో ఓటమిని ముందే ఫిక్స్ అయ్యారని అందువల్లే ఇలాంటి ఫేక్ ప్రచారాలతో కాలయాపన చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయడం వల్ల కూటమికి కలిగే లాభం కంటే నష్టం ఎక్కువని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: