కన్నప్ప మూవీ కోసం షాకింగ్ పోస్ట్ చేసిన మంచు విష్ణు.. ఏంటంటే..!?

Anilkumar
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ను ఎంతో ప్రతిష్టాత్మకంగా పెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో భారీ స్టార్టింగ్ ను దింపుతున్నారు. కాగా ఈ సినిమా టీజర్ ను ఇవాళ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఇందులో భాగంగానే టీజర్ కి మంచి రెస్పాన్స్ సైతం వచ్చినట్లుగా తాజాగా మంచు విష్ణు తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ లో తెలిపారు. 'కేన్స్‌లో కన్నప్ప టీజర్‌ను

 ప్రదర్శించాము. మంచి స్పందన వచ్చింది. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్‌లు, స్థానిక భారతీయులతో పాటు చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. ఇలాంటి రెస్పాన్స్ చూసిన తరువాత ఎంతో సంతోషంగా ఉన్నాను. భారతదేశంలోని ప్రేక్షకుల కోసం టీజర్‌ను జూన్ 13న విడుదల చేయనున్నాం.' అని మంచు విష్ణు తెలిపారు. అయితే దీనికంటే ముందు కన్నప్ప ప్రయాణంలో నిరంతరం నాకు మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పంపుతూ నన్ను ఇంతలా ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకుల కోసం టీజర్ ను మే 30న

 హైదరాబాదులోని ఒక ప్రముఖ థియేటర్స్ లో తెలుగు వెర్షన్ లో ప్రదర్శించబోతున్నట్లుగా తెలియజేశాడు మంచు విష్ణు. త్వరలోనే అందరికీ ఆహ్వానాలు కూడా అందుతాయి అంటూ వెల్లడించారు. కన్నప్ప గురించి ప్రపంచాన్ని మీ అందరితో పంచుకోవడానికి అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ ఈ సందర్భంగా తెలిపాడు మంచు విష్ణు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటు శరత్ కుమార్ ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ బాబు మోహన్లాల్ కాజల్ అగర్వాల్ నయనతార మధుబాల వంటి చాలామంది స్టార్ నటీనటులు నటిస్తున్నారు. మరి ఇంతమంది స్టార్ నటీనటులతో వస్తున్న ఈ సినిమా ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: