హిందూపూర్: టీడీపీ కంచుకోట బద్దలవ్వడం కష్టమేనా..?

Divya
టీడీపీ కంచుకోటగా హిందూపురం మారిన విషయం తెలిసిందే.. గత 41 సంవత్సరాలుగా నందమూరి తారకరామారావు హయాం నుంచి టిడిపిని అక్కడ గెలుస్తూ వస్తోంది.. ముఖ్యంగా దివంగత నేత నందమూరి తారక రామారావు నుంచి బాలకృష్ణ వరకు ఆ సీటు వీరికి తప్ప మరి ఎవరికి లభించలేదు..అంతటి పటిష్టమైన కంచుకోట ఇప్పుడు బీటలు వారే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి కారణం వైఎస్సార్ పార్టీ కొన్ని సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకోవడమే అని తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటు బ్యాంకుకు పరిపూర్ణానంద స్వామి గండి కొడతాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. పైగా 2019 ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో బాలకృష్ణ గెలవడం.. మరి ఈసారి పరిపూర్ణానంద స్వామి చీల్చే ఓట్ల వల్ల మెజారిటీ మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైయస్సార్ పార్టీ మూడవ స్థానానికి వెళ్లిపోతుంది.. స్వామీజీ చీల్చిన ఓట్లల్లో బిసి, ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఎక్కువ. కాబట్టి ఆయా ఓట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన ఓట్లనే ఆయన చీల్చబోతున్నారు.. కాబట్టి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
క్రిందటి సారి మెజారిటీ కంటే ఈసారి భారీ మెజారిటీ లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పాతికవేల ఓట్ల మెజారిటీతో బాలయ్య గెలవబోతున్నారు అంటూ రెండు సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి కూడా బాలయ్య నియోజకవర్గమే అని పిలిపించుకోబోతుంది అనడంలో సందేహం లేదు. మొత్తానికి అయితే అటు వైసీపీ ఇటు పరిపూర్ణానంద స్వామి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ టీడీపీ కంచుకోట ను కూల్చలేరు అన్న విషయం స్పష్టం అవుతుంది. ఏది ఏమైనా గత 41 సంవత్సరాల కంచుకోటని ఈసారి కూడా వైసిపి బద్దలు కొట్టలేదని పలు సమీకరణాలు చెబుతున్నాయి. మరి బాలయ్య ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారు అన్న విషయం ఒక్కటే ఇప్పుడు అక్కడి ఓటర్లలో సందేహంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: