మోడీ-బాబు: ఓట్లు కోసం జనాలని బెదిరించడం ఏందో?

Purushottham Vinay
రాజకీయ నేతలకు ఓటర్ల నుంచి ఓట్లు ఎక్కువగా సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చాలా మంది ఓటర్లని విన్నపాలు చేసుకోవడం, తాము ఎలాంటి మంచి పాలన అందిస్తామో చెప్పడం, తమ నాయకత్వ లక్షణాల గురించి తాము చేసిన కార్యక్రమాల గురించి జనాలకు చెబుతూ వారి మెప్పు పొందుతూ ఉంటారు.ఇది సంప్రదాయ ఎన్నికల ప్రచారంలో అందరూ అనుసరించే విధానం. కానీ ఈసారి జరిగింది మాత్రం వేరే లెవెల్ అని తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ , టీడీపీ అధినేత చంద్రబాబు వేరే మార్గాలు క్రియేట్ చేశారని తెలుస్తుంది. అదేంటంటే ఓటర్లను భయపెట్టి ఓట్లు పొందడం అని తెలుస్తుంది. ఇక జూన్ 4న కనుక ఫలితాలు వచ్చి కేంద్రంలో మోడీ అలాగే ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇక సంక్షేమ పధకాలు కానీ అభివృద్ధి కానీ అసలు అవసరం లేదని రాజకీయ విశ్లేషకుల నుంచి తెలుస్తుంది.అదేలా అంటే ఈ ఇద్దరి నేతల ప్రసంగాలు ప్రచార శైలిని బట్టే వీళ్ళు ఓట్లు ఎలా సంపాదించుకోవాలి అనుకుంటున్నారో స్పష్టంగా అర్ధం అవుతుంది.నరేంద్ర మోడీ రెండు సార్లు కేంద్రంలో బీజేపీ తరఫున అధికారంలో ఉన్నారు. ఏకంగా పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. కానీ ఆయన తన ప్రచారంలో ఎక్కడా కూడా తాను ప్రధానిగా గత దశాబ్ద కాలంలో చేసిన అభివృద్ధిని గురించి చెప్పుకోవడం లేదు అన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంతే సంగతులు అంటూ ఓటర్లను విపరీతంగా భయపెడుతున్నారని తెలుస్తుంది.

నిజానికి చూస్తే పదేళ్ళ పాలనలో జీ 20 సమ్మిట్ ని దేశంలో నిర్వహించామని మోడీ చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే దేశ ఆర్ధిక వృద్ధి రేటుని అయిదు ట్రిలియన్ డాలర్లకు చేర్చుతామని చెప్పడంలేదు, విశ్వ గురు అన్న మాట కూడా లేదు, మేక్ ఇన్ ఇండియా అన్న మాట అస్సలు లేనే లేదు, ఉద్యోగాల కల్పన గురించి కానీ దేశంలో సమస్యల గురించి కానీ ప్రసంగం అనేదే ఏమీ లేదు.కేవలం కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడడం ముస్లిం మైనారిటీల పేరిట ఎమోషన్ క్రియేట్ చేయడమే ఒక తంతుగా సాగుతోందని తెలుస్తుంది. దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే చాలు ముస్లిం లకు దోచిపెడుతుంది అన్న మాటనే ఒక నినాదంగా ప్రధాని మోడీ ఇంకా బీజేపీ  చేసుకుందని తెలుస్తుంది. సేమ్ చంద్రబాబు కూడా అంతే.ఎంత సేపూ వైసీపీ అధికారం లోకి వస్తే ఏపీ నాశనం అవుతుందని చెబుతూ వచ్చారు. అంతే కాదు ఎపుడో అయిదేళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వివేకా హత్య కేసుని పదే పదే ఎన్నికల సభలలో ప్రస్తావిస్తూ ఓటర్లను బాగా భయపెట్టేశారు.మళ్ళీ జగన్ ఏపీలో అధికారంలోకి వస్తే మీ భూములు దోచుకుంటారని కూడా ప్రజలని బెదిరింపులు చేశారు. ఇలా వీళ్లిద్దరూ ప్రజలని భయపెట్టి ఓట్లని సాధిస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: