జగన్ విషయంలో మరీ ఇంత దిగజారారా.. విదేశాల్లో సైతం ఘోరంగా దుష్ప్రచారమా?

Reddy P Rajasekhar
ఏపీ సీఎం జగన్ విషయంలో కుట్రలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అవినీతి లేకుండా పాలన సాగింది. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థల ద్వారా అవినీతి పూర్తిస్థాయిలో తగ్గిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే జగన్ అవినీతి చేశారని విదేశాల్లో కొంతమంది చేత ప్రచారం చేయిస్తూ ఆ వీడియోలను ఒక పార్టీ నేతలు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు.
 
ఈ విషయం తెలిసిన జగన్ అభిమానులు జగన్ విషయంలో మరీ ఇంత దిగజారారా విదేశాల్లో సైతం ఘోరంగా దుష్ప్రచారమా? అని కామెంట్లు చేస్తుండటం గమనార్హం. జగన్ ను ఇంతలా టార్గెట్ చేసి ఏం సాధిస్తారని వ్యక్తిగతంగా జగన్ విషయంలో దారుణంగా కుట్రలు జరుగుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతలా కుట్రలు చేసి ఏం సాధిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
 
జగన్ పై కేసులు ఏ విధంగా నమోదు అయ్యాయో చంద్రబాబుపై కూడా అదే విధంగా నమోదు అయ్యాయని ఇద్దరూ బెయిల్ పై ఉన్నారని అయినప్పటికీ జగన్ ను ఇంతలా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాయడానికి కూడా వీలు లేని భాషలో జగన్ లండన్ పర్యటన గురించి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు దిగజారుడు కథనాలను ప్రచురిస్తున్నాయి.
 
అవే యూట్యూబ్ ఛానెళ్లు బాబు గారి విదేశీ పర్యటన గురించి ప్రశ్నించకపోవడం గమనార్హం. తన గురించి తప్పుడు ప్రచారం చేసే వ్యక్తుల విషయంలో జగన్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు విషయంలో ఒకలా జగన్ విషయంలో మరోలా ప్రచారం చేయడం ఆ ఛానెళ్లకే చెల్లిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ గత ఐదేళ్లలో ప్రజల కోసం ఎన్నో మంచి పథకాలను అమలు చేయడం జరిగింది. ఆ పథకాల వల్ల ప్రజలకు ఎన్నో బెనిఫిట్స్ కలిగాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: