రొమాంటిక్ సీన్స్ చేయడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా..!?

Anilkumar
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం అభినయంతో ఇప్పటికే ఎందరినో తన ఫ్యాన్స్ చేసుకుంది. అంతేకాదు తన డాన్స్ కి కూడా ఇప్పుడు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఒకప్పుడు బోల్డ్ సన్నివేశాలకు దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె చేసే ప్రతి ఒక్క సినిమాల్లో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

 ఇటీవల లస్ట్ స్టోరీస్ టు జి కర్ధ వంటి వెబ్ సిరీస్ లలో తమన్నా రెచ్చిపోయి నటించింది. ఏకంగా బెడ్ సన్నివేశాలో  నటించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఏ సినిమాలో కనిపించని విధంగా ఈ వెబ్ సిరీస్ లలో ఘాటు రొమాన్స్తో రెచ్చిపోయింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగానే  శృంగార సన్నివేశాలపై పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనితో ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తమన్న మాట్లాడుతూ.. రొమాంటిక్ సీన్స్ లో నటించడం చాలా కష్టం

 నేను మొదట్లో ఇలాంటి వాటిలో నటించకూడదు అని అనుకున్నాను.. కానీ ఊహించిన విధంగా నా రూల్స్ ని బ్రేక్ చేయాల్సి వచ్చింది.. నేను బోల్డ్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ నాకు అలాంటి పరిస్థితి రాలేదు. కానీ ఇప్పుడు తప్పక చేయవలసి వస్తుంది. చాలామంది శృంగార సన్నివేశాలు నటించడానికి హీరోయిన్స్ చాలా ఇబ్బంది పడతారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఒక నటి ఆ సిన్ చేయడానికి ఎంత భయపడుతుందో అంతకు రెట్టింపుగా హీరో భయపడతాడు. నాతో ఉన్న నటి ఈ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు భయపడకూడదు ఇబ్బంది పడకూడదు అని చాలా జాగ్రత్తగా వహించి నటిస్తారు హీరోలు.. అంటూ వెల్లడించింది. అంతేకాదు అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్ తో ఆ సన్నివేశాల్లో నటించాలి అప్పుడే ఆశించే చాలా బాగా వస్తుంది అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది తమన్నా..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: