"ఇండియన్ 2" విడుదల తేదీ లాక్..?

MADDIBOINA AJAY KUMAR
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో ఒక్క సారిగా దర్శకుడు శంకర్ క్రేజ్ ఇండియా వ్యాప్తంగా పెరిగి పోయింది. అలాగే కమల్ క్రేజ్ కూడా ఈ సినిమాతో భారీగా పెరిగింది. ఇంతటి విజయం సాధించి భారీ కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం శంకర్ , కమల్ హాసన్ హీరోగా "ఇండియన్ 2" అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. దానితో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను ఈ సంవత్సరం జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు కానీ ఏ తేదీన విడుదల చేయనున్నారు అనే విషయాన్ని మాత్రం ఈ మూవీ మేకర్స్ ప్రకటించలేదు.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఈ సంవత్సరం జూన్ 13 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు మే 15 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ను చెన్నై లో నిర్వహించనున్నట్లు దానికి రజనీ కాంత్ , రామ్ చరణ్ లను ముఖ్య అతిథులుగా తీసుకు వచ్చే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: