లాస్ట్ మినిట్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తన సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటున్నాడు ప్రభాస్. అయితే మొన్న ఆ మధ్యాహ్నం నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ఒక పోస్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆయన అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఆ స్పెషల్ పర్సన్ ఎవరు.. ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా.. లేదా తన లవర్ ని పరిచయం చేయబోతున్నాడా.. అని 100 రకాలుగా ఆలోచించారు. కానీ దానికి సమాధానం మాత్రం దొరకలేదు. ఇక పాన్ ఇండియా

 స్థాయిలో ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే అలా చేశాడు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కల్కి సినిమాలో బుజ్జి అనే పాత్రను పరిచయం చేస్తూ ప్రమోషన్స్ లో భాగంగానే ఇలాంటి ఒక పోస్ట్ చేశారు అని సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. ఇక ఇప్పుడు బుజ్జి ఎవరు అన్న విషయాన్ని మాత్రం క్లారిటీగా రివీల్ చేయలేదు. రేపు జరగబోయే ఈవెంట్ లో అసలు బుజ్జి ఎవరు అని రెవీల్ చేయబోతున్నారు మేకర్స్. కాగా కల్కి సినిమాలో భైరవ అనే

 పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్. రేపు సాయంత్రం ఐదు గంటలకి తన జీవితంలో రాబోతున్న ఆ స్పెషల్ పర్సన్ ను ప్రభాస్ అధికారికంగా అందరికీ పరిచయం చేయబోతున్నాడు అంటూ ఇప్పుడు ఒక వార్తా సోషల్ మీడియాలో వినబడుతుంది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ఈవెంట్ జరగబోతుంది. ఈ వేడుకకు టాలీవుడ్ బడాస్టార్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది . బుజ్జి అంటే సినిమాలో ప్రభాస్ పాత్ర వాడే వాహనం అంటూ తెలుస్తుంది .  ఈ వాహనాన్ని రేపు అందరి ముందు అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట. ఈ వాహనం చాలా వెరైటీగా ఉంటుంది అని చాలా కష్టపడి ఈ వాహనాన్ని డిజైన్ చేశారు అని ..తెలుస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: