కర్ణాటక ఎన్నికల పై నోరు మెదపాలంటే భయపడిపోతున్న చంద్రబాబు!

KSK
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి ప్రస్తుతం కక్కలేము మింగలేము అన్నట్టుగా ఉంది.  తాజాగా ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్లు వచ్చి రాకపోవడంతో...గవర్నర్ ని తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం ఉందని దేశంలోనే అతిపెద్ద పార్టీ బిజెపి అని చెప్పి రాష్ట్రంలో అధికారం చేపట్టడంపై కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


ఈ పరిణామంపై దేశంలో పలు జాతీయ రాజకీయ పార్టీల అధినేతలు భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా సదరు పార్టీల నేతలు కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, యూపీ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయవతి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కుమార‌స్వామి ఫోన్ చేశారు.


అయితే ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం నోరు మెదపటం లేదు. గతంలో జాతీయ రాజకీయాలను శాసించింది నేనే అంటూ ప్రగల్భాలు పలికే చంద్రబాబు ఇప్పుడు నోరు మెదపకపోవడం పై ఆసక్తి నెలకొంది. మామూలుగానే బీజేపీ అంటే ఇటీవల ఒంటికాలిపై లేచే వారు చంద్రబాబు.


అయితే తాజా పరిస్థితులపై చంద్రబాబు మౌనం వెనుక కేసుల భయం ఉందని...ఇందువల్లనే చంద్రబాబు నోరు మెదపడంలేదు జాతీయస్థాయిలో నాయకులు మాట్లాడుతున్న...ఒకవేళ స్పందించిన తాను ఇంతకుముందు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను, గవర్నర్ వ్యవస్థను నిర్మూలనం చేసి తన పార్టీలో చేర్చుకున్ని  మంత్రి పదవుల ఇచ్చినా విషయం ఎక్కడ బయటకు వస్తుందో అని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: