చంద్రబాబు, లోకేశ్‌ను వెంటాడుతున్న గాజు గ్లాసు?

Chakravarthi Kalyan
కూటమిలో భాగంగా ఉన్న జనసేన 21 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే ఆ పార్టీ బరిలో లేనిచోట్ల గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఇండిపెండెంట్లకు ఇచ్చింది. దీంతో కూటమి ఓటర్లలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉంది. ఓట్లు చీలేందుకు అవకాశం ఉంది. ఎన్డీయే అభ్యర్థులు బలంగా, వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నచోట్ల ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్న ఆయా పార్టీల రెబల్‌ అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.  

ఈ గాజు గ్లాసు టెన్షన్‌ చంద్రబాబు, లోకేశ్‌, అచ్చెన్నాయుడుకూ తప్పడం లేదు. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో ఇండిపెంటెంట్‌ అభ్యర్థి నీలమ్మకు గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు. ఇక టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ గాజు గ్లాసు గుర్తు కనిపిస్తోంది. ఇక్కడ  నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న టెక్కలిలోనూ గాజు గ్లాసు గుర్తు ఇండిపెంటెంట్‌కు ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలోనూ ఇండిపెండెంట్‌కు గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: