ప్రభాస్ కోసం వారిని దించుతున్న డైరెక్టర్...!!

murali krishna
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సంచలనంగా మారాడు. ఇప్పటివరకు తీసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. మొదట అర్జున్ రెడ్డి తరువాత కబీర్ సింగ్, యానిమల్ మూవీలతో తన డైరెక్షన్ దమ్మేంటో దేశం మొత్తం తెలిసేలా చేశాడు. సినిమా సరిహద్దులను దాటి మరి కొత్తదనం చూపిస్తూ.. చిత్రీకరించారు. మొదట తెలుగులో తర్వాత రెండు సినిమాలు.. బాలీవుడ్ లో చిత్రీకరించి సత్తా చాటాడు. గత ఏడాది విడుదలైన యానిమల్ సినిమా.. దాదాపు 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ ని.. చాలా వైలెంట్ గా చూపించాడు.
ఇదిలా ఉంటే నెక్స్ట్ ప్రభాస్ తో “స్పిరిట్” అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ స్క్రిప్ట్ వరకు పనులు పూర్తయిపోయాయి. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నట్లు సందీప్ రెడ్డి తెలియజేశారు. ఇదిలా ఉంటే “స్పిరిట్” మూవీ కోసం ఇద్దరు హీరోయిన్లను సందీప్ రెడ్డి ఓకే చేసినట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ గా బాలీవుడ్ నటి కియారా అద్వానీ ని.. సెలెక్ట్ చేసినట్లు టాక్. అంతేకాకుండా స్టార్ హీరోయిన్ నయనతార కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో ప్రభాస్ తో నయనతార “యోగి” అనే సినిమా చేయడం జరిగింది. ఈ ఇద్దరు హీరోయిన్ల కి ఇండియా మొత్తం మార్కెట్ ఉండటంతో సందీప్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జవాన్ సినిమాతో నయనతారకి మంచి ఇమేజ్ రావటం జరిగింది. అందువల్ల సందీప్ రెడ్డి నయన్ కి కథ వినిపించినట్లు ఆమె కూడా ఓకే చెప్పినట్లు టాక్. దాదాపు 300 కోట్ల రూపాయలతో “స్పిరిట్” మూవీ.. షూటింగ్ నిర్మితం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ కల్కి, రాజా సాబ్ షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. కల్కి జూన్ నెలలో విడుదల కాబోతుంది. ఇక మారుతి తీస్తున్న రాజా సాబ్ వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సమయంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కల్కి షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే సలార్ స్టార్ట్ చేసి దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో “స్పిరిట్” మూవీని ప్రభాస్ సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: