నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బాలయ్య 109 సినిమా నుండి అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
నట సింహం నందమూరి బాలకృష్ణ ఈ వయసులో కూడా యంగ్ హీరోలకి పోటీగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆయన నటించిన భగవంత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం బాబి దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేస్తున్నాడు.  ఈ నేపథ్యంలోనే రాజకీయాలు మధ్యలో రావడంతో గత కొద్ది రోజులుగా రాజకీయ ప్రచార కార్యక్రమాల్లోనే బిజీగా ఉన్నాడు.  ఈ ఎలక్షన్స్ కంటే ముందు ఫిబ్రవరి వరకు బాబీ దర్శకత్వంలో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న

 బాలయ్య మార్చి నుండి మళ్లీ రాజకీయాల వైపు వెళ్లిపోయాడు. అలా గత కొద్ది రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య మళ్ళీ ఇప్పుడు సినిమాలతో బిజీగా మారనున్నాడు. అయితే ఎన్నికల ముందే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా సగానికంటే ఎక్కువే పూర్తయింది. ఆ తర్వాత టీజర్ కూడా విడుదల చేశారు. ఇక ఆ టీజర్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా 80స్ నేపథ్యంలో సాగే మాఫియా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రాబోతోంది. ఇక ఇందులో బాలయ్య ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.  తాజాగా ఇప్పుడు ఈ

 సినిమా కొత్త షెడ్యూల్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.  బాలయ్య ఎన్నికల ఫలితాల కంటే ముందే మళ్లీ షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా సమాచారం. మే చివరి వారంలో బాలయ్య మళ్ళీ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారట. దాని తర్వాత మళ్లీ వారం రోజుల తర్వాత ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఫలితాలు వచ్చిన తర్వాత మళ్లీ దాదాపుగా మరొక వారం రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి రాజకీయ పనులు చూసుకుని ఆ వెంటనే మళ్ళీ సెట్స్ లో జాయిన్ కానున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు అన్ని అనుకున్నట్లుగానే జరిగి షూటింగ్ త్వరగా కంప్లీట్ అయితే దసరాకి ఈ సినిమాని విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య ఒకవైపు రాజకీయ పనులను మరొకవైపు సినిమాలో పనులను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. మరి ఇదివరకు సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య ఈ సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: