వామ్మో! దర్శన్ రేణుకా స్వామిని అంత దారుణంగా చంపాడా?

Purushottham Vinay
చిత్ర దుర్గకు చెందిన రేణుక స్వామిపై కన్నడ స్టార్ నటుడు దర్శన్ గ్యాంగ్ దాడి చేయడంతో తలకు చాలా తీవ్రమైన గాయం తగలడంతో మృతి చెందినట్లు విక్టోరియా ఆస్పత్రి వైద్యుల పోస్టుమార్టం నివేదికలో తేలింది.అయితే రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి, విక్టోరియా ఆస్పత్రి టీం కామాక్షిపాళయ పోలీస్ స్టేషన్‌లో పోస్ట్‌మార్టం పరీక్షపై మౌఖిక నివేదికను సమర్పించింది. అందులో రేణుక స్వామి మరణానికి ముఖ్య కారణం తలకు తగిలిన గాయం అని వారు చెబుతున్నారు. రేణుకాస్వామి మృతదేహంపై గాయాల ఆనవాళ్లు ఎక్కువ కనిపించాయి. అతని మెదడు, ఛాతీ, చేతులు -కాళ్ళు, మెడ ఇంకా అలాగే తలపై గాయాలయ్యాయి. అతని మర్మాంగానికి ప్రాణాంతకమైన దెబ్బ తగిలితే, నొప్పితో గుండెపోటుతో చనిపోయాడని అనుకున్నారు కానీ రేణుకాస్వామి తలకు తగిలిన గాయమే ఆయన మృతికి ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు ‘కన్నడప్రభ’కు తెలిపాయి. బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌లోని పట్టగెరె షెడ్‌లో రేణుకాస్వామిపై కన్నడ నటుడు దర్శన్ గ్యాంగ్ దాడి చేసింది. 


ఆ సమయంలో తలపై బలమైన దెబ్బ తగిలినా కూడా రక్తం మాత్రం కారలేదు. దీంతో రేణుకాస్వామి తలలో రక్తం గడ్డకట్టడంతో అతను మృతి చెందాడు. అయితే తుది పోస్టుమార్టం నివేదిక సమర్పించిన తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపనున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిపుణులు వెరిఫికేషన్‌ తరువాత మరణానికి గల కారణాలపై స్పష్టత ఇస్తారని సీనియర్‌ అధికారులు తెలిపారు. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన సినీ నటుడు దర్శన్‌ సహా నిందితులపై విచారణ అనేది బెంగళూరు అన్నపూర్ణేశ్వరి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కొనసాగుతోంది. కానీ స్టేషన్ లోపల ఏం జరుగుతుందో తెలియని విధంగా స్టేషన్ చుట్టూ కూడా పరదా వేసి స్టేషన్ మొత్తాన్ని దాచి ఉంచారు. దీనిపై పశ్చిమ డివిజన్ డీసీపీ ఎస్.గిరీష్ వివరణ ఇస్తూ.. ‘రేణుకాస్వామి హత్య అసలు మామూలు కేసులా కాదు. ఈ కేసు దర్యాప్తులో చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి. చాలా కోణాల్లో విచారణ జరిపి కేసు పవిత్రతను కాపాడాల్సి ఉంది. కాబట్టి కొన్ని చర్యలు తీసుకొక తప్పడం లేదని ఇంకా విచారణ విషయం బయటపెట్టలేమని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: