ఏపీ : వందకోట్ల స్కాంలో మాజీ మంత్రి..?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రధేశ్ లో కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి అధికారం చేపట్టింది కనుక గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, విధానాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఆర్‌కే రోజాపై మొదట వేటు పడనుంది.మంత్రిగా ఉన్న టైంలో ఆమె చేసిన హడావిడి మాములుగా ఉండేదికాదు.తన దూకుడు స్వభావంతో అలాగే ఆమె మాటలతో, చేష్టలతో టీడీపీ, జనసేన పార్టీలపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.వైసీపీ ప్రభుత్వంలో మంచి రెబల్ మంత్రిగా పేరున్న ఆర్కే రోజా సెల్వమణి ఒక ఆడది అన్న సంగతి మర్చిపోయి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎన్నో మాటలు అన్నారు. అయితే దానికి ప్రస్తుతం భారీ మూల్యం చెల్లించాల్సిన సమయం వచ్చినట్లుంది రోజాకు.

గతేడాది జగన్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'ఆడుదాం ఆంధ్రా', 'సీఎం కప్‌' పేరిట క్రీడా పోటీలు నిర్వహించింది. సంబంధిత శాఖ మంత్రి ఆర్‌కే రోజా, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఆ పోటీల్లో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.నాసిరకం క్రీడా కిట్లు, ఏర్పాట్లు చేసి భారీగా నిధులు కొల్లగొట్టారని ఆ సమయంలోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ క్రీడా ఉత్సవాలపై ఫిర్యాదులు వచ్చాయి.గురువారం విజయవాడలో ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్‌ విలేకరులతో మాట్లాడారు.వారి హయాంలో పనిచేసిన శాప్‌ ఎండీలు, శాప్‌ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల్లోని డీఎస్‌డీవోలపై విచారణ జరపాలని కోరానన్నారు. క్రీడా కోటా ద్వారా మెడికల్, ఇంజినీరింగ్, ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైనా విచారణ చేపట్టాలన్నారు. నాటి కార్యక్రమాలకు సంబంధించిన దస్త్రాలన్నీ సీజ్‌ చేయాలని ఆయన కోరారు. ఐదేళ్ల కాలంలో శాప్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: