రోడ్ షోలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ హరీష్ రావు..!

Pulgam Srinivas
మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరు అయినటువంటి హరీష్ రావు రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో ప్రాంతాలను పర్యటించి అక్కడి జనాలతో , కార్యకర్తలతో , నాయకులతో భేటీ అవుతూ ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుంటున్నాడు. అలాగే గెలుపు కోసం ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాలను నాయకులకు, కార్యకర్తలకు సూచిస్తూ వారిని ముందుండి నడిపిస్తున్నాడు.

అలాగే ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తోంది. ఎలాంటి మాటలను చెప్పి అధికారంలోకి వచ్చింది. వాటిని నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యింది అంటూ విమర్శలను చేస్తూ వస్తున్నాడు. ఇకపోతే తాజాగా హరీష్ రావు ... సంగారెడ్డి జిల్లా సదాశివపేట లో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కి మద్దతుగా నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ రోడ్ షో లో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ ... గులాబి జెండా ఉండగా ఈ ప్రాంతం అభివ్రుది చెందింది. కాంగ్రెస్ వచ్చాక అనేక సమస్యలు ఇక్కడి ప్రజలకు వచ్చాయి.

అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మహిళలకు 2500 అని మాట ఇచ్చారు కానీ దానిని తప్పారు. 30 దాటినాపింఛన్లు ఇవ్వడం లేదు. తులం బంగారం ఇస్తాం అని అన్నారు.  కానీ మాట ఇచ్చి మోసం చేశారు. అలాగే కాంగ్రెస్ వాళ్లు వచ్చాక బంగారం ధర కూడా పెరిగింది. నిరుద్యోగ భృతి అని మోసం చేశారు. కాంగ్రెస్ కు మళ్ళీ ఓటు వేస్తే హామీలు అమలు చేయరు. కొట్లాడ్లంటే మీరు బి ఆర్ ఎస్ గెలిపించాలని కోరుతున్నా. కాంగ్రెస్ పాలన బయట పడ్డది.

బీ జే పీ కి ఓటు వేస్తే పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే తెలంగాణకు ఎంతో నష్టం చేసింది బీ జే పీ. అందువల్ల బీ జే పీ ని అస్సలు నమ్మద్దు అని మనవి చేస్తున్నా. అలవి గాని హామీలు ఇస్తే మొన్న దుబ్బకాలో ఆయన్ని చిత్తుగా 54 వేల ఓట్లతో ఓడించారు. ట్రస్ట్ ద్వారా వంద కోట్లు ఖర్చు చేస్తా అంటున్న వెంకటరామా రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా అని తాజా రోడ్ షో లో భాగంగా హరీష్ రావు చెప్పకచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: