మోస్ట్ టాలెంటెడ్ నటుడు
అల్లరి నరేష్ తాజాగా ఆ ఒక్కటి అడక్కు అనే ఫుల్ లెన్త్
కామెడీ ఎంటర్టైనర్
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ లో పొడుగు కాళ్ళ సుందరి పరియ అబ్దుల్లా
హీరోయిన్ గా నటించగా ... మళ్లీ అంకం ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ ని మే 3 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను కొన్ని పాటలను ఈ
మూవీ మేకర్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.
ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత
అల్లరి నరేష్ నటించిన ఫుల్ లెన్త్
కామెడీ ఎంటర్టైనర్
మూవీ కావడంతో ఆ ఒకటి అడక్కు సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ
మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్
ఈవెంట్ తేదీ వేదికను ఖరారు చేస్తూ ఓ
పోస్టర్ ను విడుదల చేసింది. మే 1 వ తేదీన సాయంత్రం 6 గంటలకు , దస్పల్లి ,
హైదరాబాద్ లో ఈ
మూవీ ప్రి రిలీజ్
ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు ఈ
మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం
నరేష్ ,
నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ
మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఇందులో
నరేష్ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇక హీరోగా
అల్లరి నరేష్ ఆఖరుగా ఉగ్రం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అంతకు ముందు ఈయన నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఆ ఒకటి అడక్కు
మూవీ తో
నరేష్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.