ముఖ్యమంత్రి గారూ! క్షమాపణ చెపుతారా? కూలీ డబ్బిస్తారా? లేదా బజార్న పడతారా?

అరవింద్ కేజ్రీవాల్ పాపం! ప్రతిరోజూ వరసగా క్షమాపణలు చెబుతూ ప్రాంతీయ, జాతీయ వార్త ల్లో హాట్-టాపిక్‌ గా, బాగా హై-లైట్ అవుతూనే ఉన్నారు ఈ మద్య. ఇలా జనం నోళ్లలో సమాచార మాధ్యమంలో నిలుస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రివర్యులు అరవింద్ కేజ్రీవాల్ కొత్తగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇది మాత్రం అన్యాయం అంటున్నారు. గద్దలను కొట్టి కాకులకు వేస్తే  జన నాయకుడు అంటారు. అలా కాకుండా రోజు కూలీల కడుపు కొడితే వాళ్ల కడుపు మండి బజారు కీడుస్తారు. అదే జరిగింది కేజ్రీవాల్ సార్ కి.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ర్యాలీ లో పాల్గొంటే రోజుకు ₹ 350/- ఇస్తామని చెప్పి తమను ర్యాలీలో పాల్గొనేలా చేసి ఆ తరవాత తమను మోసం చేశారంటూ కొంత మంది రోజు కూలీలు అనబడే వ్యక్తులు ఆందోళనకు దిగారు. కూలీ డబ్బులతో పాటు తమకు భోజనం కూడా పెట్టిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హామీ ఇచ్చినట్లు, ఆ తరవాత హామీ నెఱవేర్చనట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ విష్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే స్పందించి తమకు హామీ ప్రకారం రావలసిన కూలి డబ్బులు చెల్లించే లా చేయాలని కోరారు. కాయ కష్టం చేసుకొని కుటుంబాలను పోషించుకునే మా (కూలీల) పొట్ట కొట్ట వద్దని వారు సవినయంగా కోరుతున్నారు.  

భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పంజాబ్‌ కు చెందిన మరో నేతపై ఆధారాలు లేని ఆరోపణలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే క్షమాపనలు చెబుతూ లేఖలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో కూలీలకు కూడా సారీ చెప్పి, లేఖలు విడుదల చేయకుండా వారు అదిగిన ప్రకారం డబ్బులు చెల్లిస్తేనే మంచిది అంటున్నారు. మరి ముఖ్యమంత్రిగారు ఏం చేస్తారో చూడాలి మరి!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: