ఢిల్లీ క్యాపిటల్స్ కి షాక్.. రిషబ్ పంత్ పై నిషేధం?

praveen
ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారినపడి దాదాపు రెండేళ్ల పాటు ప్రొఫెషనల్ క్రికెట్ కి దూరమైపోయాడు అన్న విషయం తెలిసిందే. అయితే భారీ విరామం తర్వాత ఇటీవల ipl లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి మళ్లీ టీం ని ముందుకు నడిపిస్తున్నాడు. అయితే మొదట్లో తడబాటుకు గురైనప్పటికీ.. ఆ జట్టు ఇప్పుడు ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తుంది. మరి ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ అయితే వ్యక్తిగత ప్రదర్శనలతో అదరగొట్టేస్తున్నారు అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ లోను భారీ స్కోర్ చేస్తున్నారు.

 అయితే ఇలా కెప్టెన్ గా ఆటగాడిగా పంత్ పరవాలేదు అనిపిస్తున్నప్పటికీ అతనికి దురదృష్టం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలు మ్యాచ్ లలో స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు అన్న కారణంతో ఇక భారీ జరిమానా పడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత లక్ష్యాన్ని కాపాడుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో పది పరుగుల తేడాతో విజేయడంకా మోగించింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో మరోసారి రిషబ్ పంత్ స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు.

 దీంతో అతనిపై నిషేధం పడే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. నేడు కోల్కత్తా తో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కూ షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది  స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్ ఇప్పటికే రెండుసార్లు జరిమానా చెల్లించాడు. ఇక ఇటీవల  ముంబైలో జరిగిన మ్యాచ్లో కూడా మరోసారి ఇదే తప్పు రిపీట్ అయింది. ఈ క్రమంలోనే రూల్స్ ప్రకారం అతనికి 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం పడే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇక కోల్కతాతో జరిగే మ్యాచ్లో రిషబ్ పంత్ ఒక మ్యాచ్ పాటు నిషేధానికి గురి అయ్యే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: