పెంపుడు కుక్కపై ప్రేమతో.. అతను ఏం చేశాడో తెలుసా?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. ఒంటరిగా ఏకాకిలా సాగిపోతున్న జీవితానికి ఇక కలకాలం కలిసి ఉండేలా ఒక తోడు నీడను అందించే బంధమే పెళ్లి. ఈ క్రమంలోనే పెళ్లి విషయంలో ఎంతోమంది భారీగానే ఆశలు పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి. రెక్కల గుర్రం వేసుకొని ఆకాశం నుండి  కలల రాకుమారుడు దిగివచ్చి తమను పెళ్లి చేసుకుంటాడని అమ్మాయిలు.. ఇక జీవితాంతం మనం అర్థం చేసుకునే సతీమణి దొరుకుతుందని అబ్బాయిలు.. పెళ్లిపై కోటి ఆశలు పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే నచ్చిన అబ్బాయిని లేదా అమ్మాయిని జీవితంలోకి ఆహ్వానించడం లాంటివి చేస్తూ ఉంటారు.

 అయితే ఇలా పెళ్లి చేసుకుంటున్న వారు తమ పెళ్లి కార్డు ఎంతో ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా పెళ్లి కార్డును తయారు చేయించుకోవడం చేస్తూ ఉంటారు. అదే సమయంలో పెళ్లి కార్డు ఇలా తయారు చేసినప్పుడు తమ ఫ్యామిలీలోని పెద్దలందరి పేర్లు కూడా అటు పెళ్లి పత్రిక పై ముద్రించడం లాంటివి చేస్తూ ఉంటారు. తద్వారా వారందరి ఆశీర్వాదంతోనే మా పెళ్లి జరుగుతుంది అన్న విషయాన్ని చెప్పకనే చెబుతూ ఉంటారు నూతన వధూవరులు. అయితే ఇక్కడ ఇలాగే పెళ్లి పత్రికలో పేర్లు ముద్రించారు. కానీ కుటుంబంలోని పెద్ద వాళ్ళవి కాదు ఏకంగా ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కల పేర్లు.

 పెంపుడు శునకాలపై తనకున్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి. తన పెళ్లి పత్రిక పై వాటి పేర్లను ముద్రించాడు. మధ్యప్రదేశ్ లోని రాణిపురాలో ఈ ఘటన జరిగింది. ఐదేళ్ల క్రితం యశ్వంత్ స్కూటర్ కింద కుక్క పిల్ల పడగా.  దాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. మీకు ఆ తర్వాత శునకాలపై  ఇష్టం ఏర్పడి మరో మూడింటిని కూడా ఇంటికి తెచ్చుకొని పెంచుకుంటున్నాడు. వాటిని ఏకంగా సొంత కుటుంబ సభ్యులలాగా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇటీవల అతని వివాహం జరగగా.. హాల్ది సంగీత్ వేడుకలలో కూడా ఆ శునకాలను భాగం చేశాడు. ఇక ఇటీవల ఏకంగా పెళ్లి పత్రికల పై కూడా ఆ శునకాల పేర్లను ముద్రించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: