గుడ్ న్యూస్ : జగన్ నెత్తిన పాలు పోసిన చంద్రబాబు..!!

Vasishta

ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల వేడి నడుస్తోంది. సోమవారమే నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ. ఈ నేపథ్యంలో అభ్యర్థులెవరనేదానిపై ఆసక్తి నెలకొంది. వైసీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించగా.. టీడీపీ మూడో అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగింది.


          రాజ్యసభ స్థానాల్లో గెలుపోటములు ఎలా ఉంటాయనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ తమ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపిక చేసింది. అయితే టీడీపీ మాత్రం ఇప్పటికీ అభ్యర్థులను ఎంపిక చేయలేదు. ఆదివారం ఉదయం అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఆశావహుల జాబితాను ముందు పెట్టుకుని చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.


          అయితే మూడో అభ్యర్థిని నిలపకూడదని టీడీపీ నిర్ణయించింది. దీంతో వైసీపీ ఊపిరి పీల్చుకుంది. గతంలో మూడో అభ్యర్థిని కూడా టీడీపీ బరిలోకి దింపబోతోందని వార్తలొచ్చాయి. కాకినాడకు చెందిన వైసీపీ నేత సునీల్ ను మూడో అభ్యర్థిగా బరిలోకి దింపి ఆ ఒక్క సీటును కూడా జగన్ పార్టీకి రాకుండా చేయాలనుకుంటోందని ఊహాగానాలు వినిపించాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఆ సాహసం చేసేందుకు సిద్ధంగా లేదు. మూడో అభ్యర్థిని నిలబెడితే మద్దతుకోసం బీజేపీని అడుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడే కేంద్రం నుంచి బయటికొచ్చిన నేపథ్యంలో వెంటనే బీజేపీ మద్దతు కోరడం సరికాదని చంద్రబాబు భావించినట్టు సమాచారం.


          మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావ్ కు రాజ్యసభ స్థానం ఖరారైనట్టు సమాచారం. రెండో అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మస్తాన్ రావ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో రెండో సీటును రాయలసీమకు చెందిన రెడ్లకు దక్కుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు.. మైదుకూరుకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ కు టీటీడీ ఛైర్మన్ పదవి అప్పగిస్తున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: