తెలంగాణా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నాస్కాం సంస్థ ఒప్పంధం

"ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌-ఏఐసిఓఈ " కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో "నేషనల్ అసోషియేషన్ ఆఫ్ సాఫ్టువేర్ అండ్ సర్వీసెస్ కంపనీస్ - నాస్కామ్" ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణా ఐటి శాఖా మంత్రి కలవకుంట్ల తారక రామారావు, నాస్కామ్ అధ్యక్షుడు ఆర్. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఒప్పందం జరిగింది. డాటాసైన్స్, కృత్రిమమేధాశక్తి మొదలైన విషయాలకు సంబంధించి "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌" ను ఏర్పాటు చేయనున్నారు. 


ఈ సందర్భంగా నాస్కామ్ 2017-18 సంవత్సరానికి ఐటీ రంగంపై తమ నివేదికను విడుదల చేసింది. ఐటీ ఆదాయంలో 7.8 శాతం వృద్ధి ఉందని నాస్కామ్ పేర్కొంది. అంకుర సంస్థల్లొ  ప్రపంచంలోనే మన దేశం మూడో స్థానంలో ఉంది. అంకుర సంస్థల సంఖ్యలో వృద్ధి 25 శాతం వరకు ఉందని నాస్కామ్ తమ నివేదికలో వెల్లడించింది. అంకురాలకు ఆర్థిక వనరుల సమీకరణ మరింత పెరగాల్సి ఉంది. 


ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో ఈ ఏడాది కొత్తగా లక్ష ఉద్యోగాలు వచ్చాయి. వచ్చే ఏడాది మరో లక్ష ఉద్యోగాలకు అవకాశముంది. "ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్-చైన్, ఇంటర్నెట్ ఆప్ థింగ్స్" రంగాల్లో వృద్ధి అధికంగా ఉంటుందని ఈ నివేదికలో పేర్కొంది.


ఐటీ విస్తరణ మరియు అభివృద్దికి తోడ్పడుతున్న నాస్కామ్‌కు ఐటి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం అన్ని అవకాశాలను అందిపుచ్చు కొని ముందుకు వెళ్తుందని కేటీఆర్ తెలిపారు. ఏఐసీవోఈ విషయంలో తెలంగాణే ముందడుగు వేసిందన్నారు. డేటా-సైన్స్‌ లో విస్తృత ఉపాధి అవకాశాలు ఉంటాయ న్నారు. డేటా-సైన్స్ రంగంలో లక్షా ఏభై వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. అన్ని రంగాలతో డేటా-సైన్స్‌కు ముడిపడి ఉందని చెప్పారు. "వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు" నిర్వహణలో నాస్కామ్ పాత్ర కీలకమైందన్నారు. డాటా సైన్స్, కృత్రిమ మేధాశక్తి అంశాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: