అభిమాని గిఫ్ట్ ఆశ్చర్యపోయిన వైఎస్ జగన్..!

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా..ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కుంటి సాకులు చెబుతూ కాలం వెల్లబూస్తున్నట్లు వైఎస్సాఆర్ సీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి ప్రజలను చైతన్య పరిచేందుకు గత నెల 6న ‘ప్రజాసంకల్పయాత్ర’ మొదలు పెట్టారు.  ఇప్పటికి ఆయన వెయ్యి కిలోమీటర్లు యాత్ర చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో రాజన్న తనయుడికి ఎక్కడికి వెళ్లినా జనాలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

రాజన్న తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఓ అభిమాని వినూత్నమైన కానుక అందచేశాడు. నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ఆయనకు సోమవారం  దేవురపాలెంకు చెందిన కార్పొరేటర్‌ శివ ప్రత్యేకంగా చెక్క (ఉడ్‌)తో చేసిన బైక్‌ను కానుక ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు.ఇక పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ కొవూరు నియోజకవర్గంలో రైతులతో మమేకం అయ్యారు. నవరత్నాలతో జీవితాలకు ఓ భరోసా వచ్చిందని ఈ సందర్భంగా  రైతులు, మహిళలు తెలిపారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రైతులంతా సస్యశ్యామలంగా ఉండేవారని, ఆయన మాదిరిగానే వైఎస్‌ జగన్‌ కూడా రైతులకు మేలు చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్‌ జగన్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సులు కలిసి, తమ గోడు వెళ్లబోసుకున్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొన్నామని వైఎస్‌ జగన్‌ వద్ద వాపోయారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అందరికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో నెలకు రూ.20 కరెంటు బిల్లు కట్టేవారమని, ఇవాళ నెలకు రూ.300 బిల్లు కట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు.

ప్రతి విత్తనంలో, మందులో కల్తీ చేసి రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ రావాలని మహిళలు నినదించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ...ఆ బైక్‌ ఎక్కి కొద్దిసేపు కూర్చొన్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, పార్టీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు,అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: