ఉద్యోగాలు అమ్ముకుంటున్న తెలుగుదేశం నాయకులు .. హవ్వ హవ్వ

KSK
అధికార పార్టీ టీడీపీ నాయకుల మధ్య రాష్ట్రంలో సమన్వయం లేకుండా పోతుంది. తాజాగా అనకాపల్లి నియోజకవర్గం లో  తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఇప్పటికె నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. తాజాగా అనకాపల్లి నియోజకవర్గంలో ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌ పదవి తెలుగుదేశం పార్టీ మండల నాయకులు రోడ్డెక్కారు. నియోజకవర్గంలో ఉన్నముగ్గురు ఎమ్మెల్యేలు  ప్రతి నెలా ఆర్‌ఈసీఎస్‌ సొమ్ము కోటిన్నర రూపాయలను దండుకుంటున్నారని ఆరోపించారు లోకల్ బాడీ నాయకులు.

ఈ విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే రాబోయే ఎన్నికలకు అనకాపల్లి నియోజవర్గ  ఎమ్మెల్యే టిక్కెట్ విషయమై ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మధ్య తీవ్ర ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నట్టు సమాచారం. తాజాగా నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో కూడా వీరిద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. అంతేకాకుండా  జన్మభూమి గ్రామ సభలో కూడా ఎమ్మెల్యే, ఎంపీలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం గమనార్హం. జన్మభూమి గ్రామ సభలో కూడా ఎమ్మెల్యే, ఎంపీ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం గమనార్హం.

ఇప్పుడు ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌ పదవి కోసం అనకాపల్లి మండలానికి చెందిన తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్న ఉద్యోగాలను ముగ్గురు ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మండల నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యేల మీద. ఇలా ఒకే పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు మండల నాయకుల మధ్య విభేదాలు తెలుగుదేశం పార్టీకి  తలనొప్పిగా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: