ఎట్టకేలకు చంద్రబాబుని నందులు కుమ్మేశాయి

నంది అవార్డుల వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు ఎట్టకేలకు స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రతిష్టాత్మక బంగారు "నంది అవార్డుల ప్రదానం" లో ఎటువంటి వివక్ష, పక్ష పాతం చూపలేదని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు అధ్యక్షతన సోమవారం వ్యూహ కమిటీ భేటీ అయింది. ఈ సమా వేశంలో నంది అవార్డులప్రదానం పై వస్తున్న విమర్శల పట్ల ఆయన స్పందించారు. నంది అవార్డుల ప్రదానం రచ్చగా మారుతుందని అనుకోలేదని ఆయన చెప్పారు.


ఈ విషయంలో విమర్శలు వస్తాయని ముందే తెలిస్తే "ఐవిఆర్‌ఎస్ సర్వే" చేయించి అవార్డులు ఇచ్చేవాళ్లమని ఆయన పేర్కొ న్నారు. జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే అవార్డులు ఇచ్చామని ఆయన చెప్పారు. ప్రతి విషయానికి కులం రంగు పులమడం, విమర్శలు చేయడం సరైన పని కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


వైసిపి చీఫ్ జగన్ పాదయాత్రపై స్పందించాల్సిన అవసరం తమ పార్టీకి లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటూ కోర్టుల్లో వైసిపి వేస్తున్నకేసులు నిలబడవని ఆయన చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్నామని ఆయన వెల్లడించారు.


తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని కధనం.నంది అవార్డులు ఎక్కువగా ఒక కులం వారికే వచ్చాయన్న విమర్శల నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ఏపీలో ఆధార్‌ కార్డు, ఓటరు కార్డులేని వారే హైదరాబాద్‌లో కూర్చొని నంది అవార్డులపై విమర్శలు చేస్తున్నారని మంత్రి లోకేశ్‌ మండిపడిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన అసెంబ్లీలో నంది అవార్డుల అంశంపై మాట్లాడుతూ, ఒకరిద్దరు వ్యక్తులు మాత్రమే హైదరాబాద్‌లో కూర్చొని అవార్డులపై అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: