పరువు పోగొట్టుకున్న కేరళ కామ్రేడ్‌లు

కమ్యూనిజం అనేది అంతరించి పోతున్న ఒక రాజకీయ అవశేషం. ఎందుకో మనదేశంలో వీళ్ళు రాజకీయంగా నిలబడలేక పోయినా ఒక కేరళ ఒక త్రిపుర తో సరిపెట్టుకొని వ్రేలాడే గబ్బిలాల్లా కొనసాగుతున్నారు. వీరి "సిద్ధాంతపు మాతృభూమిలో నియంతృత్వం... ఆ దేశం వెలుపల కాపిటలిజం" పట్టుకొని వారు రాజకీయాలను కొనసాగిస్తుండగా, మనదేశం లో మాత్రం విఫలమైన ఆ సిద్ధాంతాలనే జనం నెత్తిన రుద్ధాలని ప్రయత్నిస్తున్నారు.


అసలే కమ్యూనిష్టులు ఆవేశపరులు. ఇతరులను విమర్శించటములో సిద్ధహస్తులు. తొందరపాటు వారి నైజం. అదే తొందర లో, ప్రధాని నరేంద్ర మోదీ మీద అక్కసుతో కేరళ వామ పక్ష వాదులు "టామ్ మూడీ" పై చెలరేగిపోయి విమర్శలు గుప్పించి తర్వాత తీరిగ్గా చేసిన తప్పుకు నాలుక కరుచుకున్నారు. ప్రతి విషయం లో తప్పులు చేయటం ఆ తరవాత దాన్ని కొన్నాళ్ళకు "చారిత్రాత్మక తప్పిదం" అని వారి చరిత్రలో రాసేసుకుంటారు. "సన్‌ రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ-ప్రధాని నరెంద్ర మోదీ"  మధ్య సంబంధం ఏంటో అర్థం కాని ఈ తింగర బుచ్చిగాళ్లకు టాం మూడీ భారత్ కు బెటర్ క్రెడిట్ రేటింగ్ ఇచ్చినట్లు ఫీలై ఆయన్ని వాయించేశారు.


అంతర్జాతీయ ప్రముఖ  క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ "మూడీస్" 13 ఏళ్ల తర్వాత భారత్‌ కు మెరుగైన రేటింగ్ ఇచ్చిన సంగతి మన కందరికి తెలిసిందే. దీనికి ముందు ఇండియా కు "BAA-3" రేటింగ్ ఉండగా, దాన్ని ‘BAA-2" కు పెంచి భారత్ ను క్రెడిట్ రేటింగ్ పరంగా ప్రమోట్ చేసింది. గతంలో అటల్ బిహారి వాజపేయీ కాలంలో పెరిగిన రేటింగ్ మరల 13 సంవత్సరాలకు ఇప్పుడు నరెంద్ర మోదీ టర్ములో భారత్ క్రెడిట్ రేటింగ్ఇప్పుడు పెంచింది మూడీస్.

ఈ రేటింగ్ ఇచ్చిన "మూడీస్‌"ను "టామ్ మూడీ" అనుకొని కేరళకు చెందిన కొందరు లెఫ్ట్ పార్టీనేతలు ఆయన్ను విమర్శిస్తూ "మూడీ ఫేస్‌-బుక్ పేజీ" లో ఆయనపై విమర్శ లకు దిగారు. ఇలా భారత ఆర్థిక వ్యవస్థ రేటింగ్ పెంచినందుకు సిగ్గు పడ మంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా వాయించేశారు. కొందరైతే, నీకు దమ్ముంటే కేరళ...రా! అని సవాల్ చేశారు. మొత్తానికి "మూడీస్" తప్పు చేసిందని విమర్శించే తొందరలో, కొందరు కమ్యూనిస్టులు అది "టామ్ మూడీ" అనే ఆ భ్రమలో క్రికెటర్ ఫేస్‌బుక్ పేజీ అనే విషయాన్ని మరిచారు.


తిమ్మిరి వదిలి చేసిన తప్పు తెలిశాక నాలుక కరుచుకున్నారు. తప్పును చారిత్రాత్మక తప్పిదం అంటూ సరిపుచ్చుకునే వామ పక్షవాదుల ఈ బాగోతం గమనించిన ఇతర మలయాళీలు జరిగిన తప్పిదానికి క్షమించమని టామ్-మూడీకి ఫేస్‌బుక్‌ లోనే సందేశం పెట్టారు. ఈ విషయాలన్నింటినీ ఆయన చూసుకున్నాడో లేదో తెలియదు కానీ.. ఆయన చివరిసారిగా అక్టోబర్ 4న తనకు బర్త్ డే విషెస్ చెప్పిన వారందరికీ థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: