భారత్ దటీజ్ హిందుస్థాన్ హిందువులదే: సామ్నా & మోహన్ భగవత్


జర్మన్ల కోసం జర్మనీ,

బ్రిటీషర్ల కోసం బ్రిటన్,

అమెరికన్ల కోసం అమెరికా.. అలాగే

హిందువుల కోసం హిందుస్తాన్


క్రైస్తవులకు అమెరికా, యూరప్‌ దేశాలు, బౌద్ధులకు చైనా, జపాన్‌, శ్రీలంక, మయన్మార్‌ వంటి దేశాలుండగా, హిందువులకు “భారత్‌” మినహా మరో దేశం లేదని పేర్కొంది. ముస్లింలకు 50 కి పైగా దేశాలున్నాయని, 25 దేశాలు పూర్తి క్రిస్టియన్ దేశాలుకాగా ఇంకా 100 దేశాల్లో ఇతరులతో కలసి క్రిస్టియన్ లు జీవిస్తున్నారు అని,  ప్రస్తావించిన పత్రిక హిందువులకు ఉన్నది ఒకటే దేశమని, అందుకే భారత్‌ ముందుగా హిందువులదేనని వ్యాఖ్యానించింది.


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ వివరించారు.  హిందుస్తాన్ లేదా భారత్  తొలుత హిందువుల కోసమేనని,  ఆ తర్వాతే  ఇతర మతాల వారికి ఆవాసమైనదని, మోహన్  భగవత్ స్పష్టం చేశారు. కాగా, హిందుస్తాన్ లో హిందువులతో పాటు సరిసమానంగా ఇతర మతస్తులు కూడా జీవించేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పారు.


ఇక్కడ హిందువులు అంటే భారతీయులు. ఈ భరతభూమి స్వంతబిడ్డలు. హిందూ జీవనవిధానం అనుసరించే మానవజాతికి ఇది జన్మభూమి. సనాతన హిందూ జీవనవిధానం పాటిస్తూ జీవించే జాతిజనులు  భారతమాత బిడ్డలని ఆయన విశ్లేషించారు. పురాతన భారతీయ వారసత్వ సంపద, సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించే వారంతా   భారతీయు లే. అందులో సందేహపడాల్సిన అవసరం లేదని మోహన్ భగవత్ పేర్కొన్నారు. భారతదేశాన్ని ఏ ఒక్క పార్టీనో, లేక ఏ ఒక్క వ్యక్తో అభివృద్ధి చేయడం అసాధ్యమని  సమాజం కూడా తమవంతు పాత్ర   పోషిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మోహన్ భగవత్ అన్నారు.


ఇక ఈ వ్యవహారంపై హిందూ సంస్కృతిని నిలువెల్లా నింపుకున్నామని చెప్పే మహారాష్ట్ర రాజకీయ పార్టీ  శివసేన కూడా స్పందించింది.  భారత దేశం తొలుత హిందువు ల దేశమని, ఆ తర్వాతే ఇతరులదని శివసేన పార్టీ పత్రిక  “సామ్నా” తన సంపాదకీయంలో పేర్కొంది.


న్యాయస్థానంలోకి న్యాయమూర్తి ప్రవేసించగానే,  అభివాద స్పూర్తిగా లేచి నిల్చునే, మన సంస్కృతి సినిమా థియేటర్ లో జాతీయగీతాలాపన సమయంలో ఒకసారి లేచి నిల్చునే సాంప్రదాయం పాటించక్కరలేదనే న్యాయమూర్తి తీర్పు యివ్వటం సమంజసమా? న్యాయస్థానాలకు కూడా జాతీయగీతాలాపన - జాతిని గౌరవించటం ఈ విషయాల్లో భిన్న ఆలోచన లెందుకు ఈ దేశాన్ని గౌరవించటం ఒక న్యాయమూర్తికి అభివాదం చేసే సంస్కృతికన్నా తక్కువా? 


దేవాలయం, చర్చ్, మజీద్ తదితర ప్రార్ధనాలయంలో వివిధ మతస్తులు తమతమ దైవాలను నిర్దేశిత పద్దతుల్లో ఆరాధించే సంస్కృతి ఉన్నపుడు, అలా చేసేటప్పుడు కులమతాతీతంగా భారత ప్రజలు ఒక ఉద్దేశంతో ఒక చోట చేరిన ప్రజలు భారతదేశాన్ని జాతీయగీతాలాపనతో 52 సెకన్లు మౌనంగా ఉండటం లో తప్పేమిటో? అందుకు అసహనమెందుకో ? ఈ ప్రజలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.    


ఈ దేశాన్ని:

1000 యేళ్ళకు పైగా ముస్లిములు

300 యేళ్లకు పైగా బ్రిటీషర్స్ పేరుతో క్రిస్టియన్స్

70 యేళ్ళకు పైగా కాంగ్రేస్ అనే ముస్లిం, క్రిస్టియన్, ఇటాలియన్ కలగూరగంప ప్రభుత్వం పాలించగాలేని అసహనం ఈ భరతమాత అసలు బిడ్దలు ఒక మూడు నాలుగేళ్ళ నుండి పాలనా కొనసాగించేటప్పుడు ఇంత అసహనం కొందరి కెందుకు.


అయితే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌ పైన శివసేన మండి పడింది,  ఎందుకంటే  కేంద్రంలో హిందుత్వ అనుకూల ప్రభుత్వమున్నా అయోధ్యలో రామాలయ నిర్మాణం, కశ్మీరీ పండిట్ల వ్యవహారం ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రామమందిర నిర్మాణాన్ని చేపట్టకుండా న్యాయస్ధానానికి వదిలి వేశారని, జాతీయగీతం ఆలపించే సమయంలో లేచి నిలబడాలన్న ఆర్‌ ఎస్‌ ఎస్‌ విధానాన్ని కొందరు వ్యతిరేకిస్తున్న తీరును ప్రస్తావిస్తూ దీనిపై కేంద్రం వైఖరి ఏమిటని “సామ్నా”  సంపాదకీయంలో శివసేన నిలదీసింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: