సీబీఐ కోర్టు జగన్ కు షాక్ ఇస్తూనే..ఊరట ఇచ్చింది..!

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో ఆ మద్య నంద్యాల ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన వైసీపీని ఓ గాడిలో పడేయడానికి వైఎస్ జగన్ నడుం బిగించాడు.  ఈ నేపథ్యంతో గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే పాదయాత్ర చేయడానికి సంసిద్దులయ్యారు.  కానీ ఇప్పటికే ఆయనపై కేసు ఉండటంతో కొంత కాలంగా పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది.    వైఎస్ జగన్ నవంబరు 2 వ తేదీనుంచి పాదయాత్ర చేయబోతున్నారు. ఈనెల 28న వెళ్లి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత.. ఇడుపులపాయలో ప్రారంభించి.. ఆరునెలల పాటు రాష్ట్రంలో 125 నియోజకవర్గాల పొడవునా పాదయాత్ర చేయాలనేది సంకల్పం.

తాజాగా సీబీఐ కోర్టు జగన్ కు చిన్న షాక్ తో పాటు, పెద్ద ఊరటను కూడా ఇచ్చింది. కాగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఏపీలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయబోతున్న నేపథ్యంలో.. ఆరు నెలల పాటూ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా.. మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరారు.  మొదట దీనిపై ససేమిర అన్న.. సీబీఐ కోర్టులో జగన్‌కు స్వల్ప ఊరట దొరికింది.

నెలకోసారి కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది సీబీఐ కోర్టు. ఐతే పాదయాత్ర దృష్ట్యా 6 నెలలు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరారు జగన్. ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు మినహాయింపు కుదరదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. అయితే, నెలలో ఓ శుక్రవారం మాత్రం వ్యక్తిగతంగా తప్పనిసరిగా హాజరుకావాలని జగన్ కి కోర్టు తెలిపింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై.. జగన్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు.

ఇక  జగన్ లోటస్ పాండ్ లో ఉదయం నుంచి సీనియర్ నాయకులతో సమావేశం పెట్టుకుని కోర్టు తీర్పు ఎలా వచ్చినా సరే.. పాదయాత్ర చేయాల్సిందేనంటూ మంతనాలు సాగించారు.  ఇంతలోనే వైఎస్ జగన్ కి కోర్టు తీర్పు ఉపశమనం కలిగించేలా వచ్చింది. ఇక పాదయాత్ర నిర్విఘ్నంగా సాగుతుందనే అనుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: