"బీమా" హిందీ వర్షన్ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
మ్యాచో స్టార్ గోపీచంద్ కొంత కాలం క్రితమే బీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైలర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హర్ష దర్శకత్వం వహించగా , మాళవికా శర్మ , ప్రియ భవాని శంకర్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ లో గోపచంద్ రెండు పాత్రలలో నటించి రెండింటితో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా యావరేజ్ విజయాన్ని మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ భాషలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ హిందీ వర్షన్ "ఓ టి టి" హక్కులను ఏ సంస్థ దక్కించుకుంది అనే విషయంపై ఇన్ని రోజుల ప్లాటు క్లారిటీ రాలేదు.

ఇకపోతే తాజాగా మాత్రం ఈ సినిమా హిందీ వర్షన్ కి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ "ఓ టి టి" హక్కులను "జీ 5" సంస్థ దక్కించుకున్నట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాలు హిందీ లో ఈ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. మరి ఈ మూవీ హిందీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc

సంబంధిత వార్తలు: