ఏపీ: వైసీపీకి దెబ్బ పడింది... ఎమ్మిగనూరు నియోజకవర్గం కూడా పాయేనా?

Suma Kallamadi

ఏపీలో ఎన్నికలకు దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అవును, విషయం ఏమిటంటే... ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగలడంతో స్థానిక నాయకులకు, కార్యకర్తలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో పుండు మీద కారం జల్లుతున్నట్టు ఆ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బివి జై నాగేశ్వర్ రెడ్డి ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ వైసీపీ పని ఇక అయిపోయినట్టేనని ఎద్దేవా చేసారు. అసలు విషయం ఏమిటంటే టీఎస్ కూలూరు, మసీద్ పురం గ్రామాల్లోని దాదాపుగా 200 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపి కండువా కప్పుకోవడం ఇపుడు అక్కడ ప్రత్యేకతని సంతరించుకుంది.
ఈ సందర్భంగా టిడిపి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బివి జయ నాగేశ్వర్ రెడ్డి కొత్తగా వారి పార్టీలో చేరే వారందరికీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన చేస్తోందని అన్నారు. ఇక టిడిపి పార్టీలో చేరిన ప్రజలందరికీ సభ వేదికగా పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... "తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను సూపర్ గా అమలు చేస్తుంది. మా సూపర్ సిక్స్ ముందు జగన్ బూటకపు హామీలు వెలవెల బోతున్నాయి. ఇక తెలుగు దేశం శకం నడుస్తుంది!" అని చెప్పగా అక్కడి కార్యకర్తలు, కొత్తగా చేరినటువంటి వైసీపీ నాయకులు చప్పట్లు కొట్టారు.
ఈ నేపథ్యంలో ఆయన చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మిగనూరులో చేనేత టెక్స్ టైల్ పార్క్ తో పాటు, ఎన్నో సంవత్సరాల నుండి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలను దగ్గరనుండి చూశానని చెప్పుకొచ్చారు. వాటిని ప్రధమంగా పరిష్కరించేందుకు పాటుపడతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు అవసరమైతే కూటమిలో భాగమైన బిజెపి ప్రభుత్వం కేంద్రంలో వుంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎమ్మిగనూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: