ఏంటి.. కూటమి గెలిస్తే పవనోరు మంత్రి అవ్వరా?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ లో ఈసారి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని కూటమి నేతలు చాలా విశ్వాసంతో ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్నారు. దానికి ఆల్టర్నేషన్ గా తెలుగుదేశం కూటమి ఉంది.అందువల్ల బలమైన గాలి వీచి టీడీపీ కూటమికే అధికారం తధ్యమని కూడా భావిస్తున్నారు.టీడీపీ కూటమి వస్తే ఎవరు సారధ్యం వహిస్తారు ఎవరు సీఎం అవుతారు అంటే రెండవ మాట లేకుండా చంద్రబాబు నాయడే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన 144 సీట్లకు పోటీ చేస్తున్నారు. పైగా కూటమికి పెద్దన్నగా ఉన్నారు. కాబట్టి చంద్ర బాబు నాయుడు కచ్చితంగా సీఎం అవుతారు.ఇంకా అంతే కాదు చంద్ర బాబు మంత్రి వర్గంలో పవన్ కళ్యాణ్ మంత్రి అవుతారని కూడా టాక్ ఉంది. పవన్ కళ్యాణ్ కీలకమైన శాఖలను తీసుకుని మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలు వదిలేసినట్లేనా అన్న చర్చ కూడా నడుస్తుంది. ఒకవేళ మంత్రి అయితే ఆయన పూర్తి కాలం రాజకీయాల్లో ఉండాలి.ప్రభుత్వ విధులలో బాగా బిజీగా ఉండాలి. అప్పుడు సినిమాలు షూటింగులకు అసలు కుదరదు. ఒకవేళ కుదిరించుకుని చేసినా కూడా విపక్షాలు ఊరుకోవు. దాంతో  గతంలో లాగా సినిమాలు చేయలేరని అంటున్నారు. సరే అలా అనుకుంటే సినిమాలు అన్నీ పవన్ కళ్యాణ్ వి పూర్తి అయ్యాయా అంటే కొన్ని పెండింగులో ఉన్నాయి.మరి వాటినయినా పూర్తి చేయాలి కదా అన్న చర్చ వస్తోంది.


పైగా ఇటీవల పవన్ కళ్యాణ్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో కొంతమంది నిర్మాతలు అప్పు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే అవి అప్పులు కావు అడ్వాన్సులని తెలుస్తుంది. ఆ విధంగా తీసుకున్నవి ఉన్నాయని కాబట్టి చేతిలో ఉన్న సినిమాలు కమిట్ అయినవి చేసి తీరాల్సిందేనని అంటున్నారు. మధ్యలో షూటింగ్ ఆగిన వాటిని పూర్తి చేయడం ఒప్పుకున్నవి అని చేయడం అంటే కచ్చితంగా ఏడాది టైం పట్టవచ్చు.మరి అంతకాలం పవన్ ప్రభుత్వంలో ఉండరా మంత్రి పదవి తీసుకోరా అంటే తీసుకోరు అని కూడా మరో వైపు వార్తలు వస్తున్నాయి. పవన్ సినిమాలను వదిలేయరని ఆయన అభిమానులకు కూడా అది అవసరమని అంటున్నారు. పవన్ తన పార్టీ నుంచి గెలిచిన వారికి మంత్రి పదవులు ఇప్పించి తాను ప్రభుత్వంలో కీలకంగా ఉంటూనే సినిమాలు కూడా చేస్తారని తెలుస్తుంది. మొత్తం మీద టీడీపీ కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగులా మినిస్టర్ మీటింగులా  అన్నది టీడీపీ గెలిచిన తరువాత అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: