ఈవిఎంలో రెండుసార్లు బటన్ నొక్కితే.. రెండు ఓట్లు నమోదవుతాయా?

praveen
నిన్న మొన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తిన అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ప్రచారం నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ విధించిన డెడ్లైన్ పూర్తి కావడంతో.. ఇక ఇప్పుడు ఆయా పార్టీల అభ్యర్థులందరూ కూడా బహిరంగంగా ప్రచారం చేయడం కాదు అంతర్గతంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలా దేశవ్యాప్తంగా కూడా ప్రచార హోరు సైలెంట్ కాగా ఓటర్లందరూ ఎవరికి ఓటు వేయాలి అనే విషయంపై ఒక నిర్ణయానికి వచ్చేసారు.

 ఈ క్రమంలోనే  తెలుగు రాష్ట్రాలలో మే 13వ తేదీన ఇక ఓటర్లు  ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఎవరు గెలుస్తారు అనే విషయంపై ఎప్పటిలాగానే ఉత్కంఠ నెలకొంది. ఈవీఎం, వివి ప్యాడ్ల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈవీఎంల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయ్. సాధారణంగా ఈవీఎంల  విషయంలో ఓటర్లందరికి కూడా ఎన్నో రకాల అనుమానాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఒకవేళ రెండుసార్లు ఈవీయంలోని బటన్ నొక్కితే రెండు ఓట్లు నమోదు అవుతాయా అని అనుమానం కూడా చాలామందికి ఉంటుంది.

 ఇక ఆ వివరాలు చూసుకుంటే.. సాధారణంగా ఒక ఈవీయంలో 16 బటన్స్ ఉంటాయి. నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్యను బట్టి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో కేవలం పది మంది అభ్యర్థులు మాత్రమే బరిలో ఉంటే.. వారికి ఒకటి నుంచి పది వరకు బటన్లను కేటాయిస్తారు. ఇక మిగిలిన వాటిని పనిచేయకుండా అధికారులు లాక్ చేస్తారు.  అలాగే బ్యాలెట్ యూనిట్ లోని బటన్ నూ ఒక్కసారి నొక్కిన వెంటనే మీ ఓటు నమోదు అవుతుంది. అటు వెంటనే ఈవీఎం లాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఎన్నిసార్లు ఓటర్ బటన్ నొక్కిన కూడా ఓటు తీసుకోదు. ఇలా ఒక ఓటర్ ఎన్నిసార్లు బటన్ నొక్కిన ఒకేసారి ఓటు నమోదు అవుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Evm

సంబంధిత వార్తలు: