ఎలక్షన్ ఎఫెక్ట్: హైవేలపైన భారీ ట్రాఫిక్..!

Divya
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు హోరహోరిగానే దూసుకుపోతున్నాయి.. ముఖ్యంగా ఈనెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమ ఓటు హక్కును సైతం వినియోగించుకునేందుకు ఆ రాష్ట్ర ఓటర్లంతా కూడా తమ స్వస్థలానికి తిరిగి వెళుతున్నారు.. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాదులో స్థిరపడినటువంటి వారందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి రావడంతో ఒక్కసారిగా రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి.తమ సొంత వాహనాలలో వెళ్లే వారితో హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే పైన భారీగానే ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తోంది.
పోలింగ్ సమయానికి మరో రెండు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఈ రోజు ఉదయం నుంచి హైవే పైన భారీగా రద్దీ కనిపిస్తోంది. ఆయా వాహనాలు విజయవాడ మీదుగా హైదరాబాద్ ,విశాఖపట్నం వంటి ప్రాంతాలకు వెళుతున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్ల పైన వెళుతూ ఉండడంతో చాలా మంది నెమ్మదిగా ముందుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఏది ఏమైనా హైదరాబాద్ శివారు హయత్ నగర్ నుంచి అబ్దుల్లా మేట్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతోందట.. ఎల్బీనగర్ విజయవాడ వైపుగా పలు రకాల టోల్ ప్లాజా ల వద్ద నిన్నటి రోజు నుంచి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.

అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీ ఓటర్లు తమ స్వగ్రామానికి భారీగానే తరలివస్తున్నట్లు కనిపిస్తోంది.. మరి ఏ మేరకు ఈ ఓటర్లు సైతం ఎవరి మీద ప్రభావం చూపిస్తాయి చూడాలి మరి..అయితే ఇప్పటివరకు ఆటో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా తాము గెలుస్తామంటే తాము గెలుస్తామని ధీమా తో ఉన్నారు.. ముఖ్యంగా ఈసారి ఎన్నికలు కూడా చాలా కీలకంగా మారాయి అన్ని పార్టీలకు.. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ పార్టీకి ఓటు వేస్తారనే విషయం పూర్తిగా తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: