జగన్‌ ఓటమి ఖాయమైందా..? ఆ మాటలే ఫ్యూచర్‌ చెప్పేస్తున్నాయా?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖంలో తొలిసారిగా భయం కనిపించింది. ఎన్నికల వేళ జగన్ నోటి నుంచి అనేక అనుమానాలు, సందేహాలు బయట పడ్డాయి. ఫస్ట్ టైం తమ అధనేత అలా మాట్లాడటంతో కేడర్ లో టెన్షన్ పెరిగిపోతుంది. మచిలీపట్నం సభలో జగన్ క్యాడర్ కు భయం కలిగించే మాటలు అనడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి అనే నమ్మకం తనకు లేదని.. ఆ నమ్మకం రోజురోజుకీ సన్నగిల్లుతోందని.. ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు పథకాలు అందకుండా చేస్తున్నారు. ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకుంటున్నారు. ఇష్టాను సారం అధికారులను మార్చేస్తున్నారు అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. జగన్ బటన్ నొక్కినా డబ్బులు విడుదల చేసినా అవి జనాలకు చేరడం లేదు. దీంతో జగన్ ఒకింత నిరాశతో కూడిన స్వరంతో మాట్లాడారు.

దీంతో ఒక్కసారిగా క్యాడర్ ఉలిక్కిపడింది. జగన్ లో ఇంత భయం ఎందుకు వచ్చిందన్న చర్చ పార్టీలో మొదలైంది. సీఎం నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడం వల్ల పార్టీ శ్రేణుల ఆత్మ స్థైర్యం దెబ్బతింటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా ఈ తరహా వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఊతం ఇస్తాయని.. ఇప్పటికే కూటమి నేతలు జగన్ ఓడిపోతారనే తెలిసే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేసీఆర్ ఓడిపోతే ఏం అయితది.. ఇంటికి వెళ్లి హాయిగా రెస్ట్ తీసుకుంటాం అని మాట్లాడారు. వీటిని కాంగ్రెస్ తెలివిగా బీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని ప్రచారం చేశారు. ఇది అంతిమంగా బీఆర్ఎస్ కు  నష్టం చేసింది. ఇప్పుడు కూడా వైఎస్ జగన్ ఈ తరహా వ్యాఖ్యలు వైసీపీకి నష్టం చేస్తాయి తప్ప సానుభూతి మాత్రం రాదని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: