Ambati rayaudu: వైసీపీ పార్టీని వీడడంపై సంచలన వ్యాఖ్యలు..!

Divya
ప్రముఖ ఇండియన్ ప్లేయర్ అంబాటి రాయుడు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఐపీఎల్ లో కొన్నేళ్లపాటు సీఎస్కే టీమ్ కి ఆడిన అంబాటి రాయుడు రిటైర్మెంట్ తర్వాత వైసిపి పార్టీలోకి చేరిన కేవలం ఒక్క పది రోజుల వ్యవధిలోనే జనసేన పార్టీలోకి వెళ్లారు.. చెన్నై తరహాలో ఆంధ్రప్రదేశ్ కు ఒక క్రికెట్ టీం ఉండాలంటూ సీఎం జగన్ ని కలిసి మాట్లాడాను అనే విధంగా కూడా తెలియజేశారు. ఆ వెంటనే వైసీపీ పార్టీ నుంచి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో కూడా తిరిగారు అంబాటి రాయుడు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి అంబాటి రాయుడు పోటీ చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపించాయి.

అయితే అలా కొద్ది రోజులపాటు వైసిపి పార్టీకి సంబంధించి వ్యవహారాలను కూడా చాలా దగ్గరుండి మరి చూసుకున్నాడు రాయుడు.ఈ పార్టీలో మనం నెగ్గుకు రావడం కష్టమనే అభిప్రాయం వచ్చిందేమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ తో భేటీ అయి ఆ తర్వాత జనసేన పార్టీలోకి వెళ్లారు.ఇప్పుడు ఆ పార్టీ గురించి అసలు ఏ విషయాన్ని కూడా మాట్లాడడం లేదు అంబాటి రాయుడు. ఇప్పుడు తాజాగా వైసీపీ పార్టీ గురించి పలు విషయాలు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో వైసిపి పార్టీ వద్దకు వెళ్లినప్పుడు అక్కడ  వాతావరణాన్ని గమనించానని ప్రజాసేవకు ఈ పార్టీ సరైన వేదిక కాదని తనకు అర్థం అయిందని తెలిపారు అంబటి రాయుడు.. వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చి జనసేన పార్టీలోకి చేరాలని తెలిపారు.. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా తెనాలిలో నందివెలుగులలో నిన్నటి రోజున జరిగిన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తరఫున ఆయన ప్రచారంలో భాగంగా తెలియజేశారు.. రాష్ట్ర యువత ప్రగతి బాగుండాలి అంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి అంటు తెలియజేశారు. ప్రతి ఓటును కూడా ప్రజల సద్వినియోగం చేసుకోవాలంటు పిలుపునిచ్చారు. మొత్తానికి తాడేపల్లి ప్యాలెస్ లో ఏం జరుగుతుందని విషయం పైన అంబాటి రాయుడు బయట పెట్టడంతో జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు సైతం వైసీపీని ఒక ఆట ఆడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: