కల్కి 2898ఏడి: బిగ్ టార్గెట్.. సాలిడ్ హిట్ అవుతుందా?

Purushottham Vinay
ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి 2898ఏడీ మూవీ తెరకెక్కుతోంది. హిందూ మైథాలజీ బేస్ చేసుకొని సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఈ మూవీని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా ఆవిష్కస్తున్నాడు.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మూవీలో శ్రీమహావిష్ణువు 10వ అవతారం అయిన కల్కి పాత్రలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జూన్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 22 భాషలలో రిలీజ్ కాబోతోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కల్కి 2898ఏడీ మూవీ అతి పెద్ద రిలీజ్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. హాలీవుడ్ లో కూడా ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. 600 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ మూవీని అశ్వినీదత్ నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ బిజినెస్ డీల్స్ నడుస్తున్నాయి. హిందీలో ఈ సినిమా రైట్స్ ని ఏకంగా 100 కోట్లకి ప్రముఖ డిస్టిబ్యూటర్ అనిల్ తడాని సొంతం చేసుకున్నారు.


100 కోట్ల డీల్ అంటే  భారీగానే జరిగినట్లు. అయితే ఈ సినిమాపై పెట్టిన బడ్జెట్ ప్రకారం చూసుకుంటే హిందీలో కల్కి 2898ఏడీ సినిమా జరిగిన బిజినెస్ తక్కువ అని చెప్పాలి. పైగా బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, సలార్ సినిమాలు హిందీలో 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేశాయి. అయితే ఈ మూవీల పై బిజినెస్ ఆధారంగా చూసుకుంటే సలార్ మూవీకి హిందీలో లాభాలు వచ్చాయని చెప్పొచ్చు. కల్కి సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సౌత్ లో ఈ సినిమా ఎంత భారీ హిట్ అయిన 300 నుంచి 400 కోట్ల దాకా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. దీనిని బట్టి చూసుకుంటే హిందీలో కల్కి సినిమాకి 200 నుంచి 220 కోట్ల మధ్య నెట్ కలెక్షన్స్ వసూళ్లు చేస్తే సినిమాకి లాభాలు వస్తాయి. అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ 150 కోట్లకి పైగా వసూళ్లు చేయాల్సి ఉంటుంది.అయితే ఈ సినిమా ఖచ్చితంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలంటే మాత్రం కల్కి2898ఏడీ మూవీ కనీసం 3 నుంచి 4 వారల పాటు థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: