బెజవాడకు మంచి రోజులు రాబోతున్నాయా..!

veeru
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ది కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రయత్నాలు మొదలు పెట్టారు.  ముఖ్యంగా కొత్తగా ఏర్పడి రాష్ట్రానికి రాజధాని అమరావతి నిర్మాణం కోసం అహర్శిశలూ కష్టపడుతున్నారు.  రాజధాని నగరమంటే దానికో గ్రేస్ ఉండాలి. పేరు చెప్పగానే ఏదో ఒకటి గుర్తుకురావాలి.  ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు హైదరాబాద్ నగరాన్ని ఐటెక్ సిటిగా తీర్చి దిద్దిన ఘనత ఆయనకే దక్కుతుంది.

తాజాగా ఏపీ రాజధాని విజయవాడకు మరో మణిహారం రాబోతోంది. ముఖ్యమంత్రిగా బెజవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి  నగర రూపరేఖలు మరింతగా  మార్చేయబోతున్నారు.  విజయవాడ నగరమనగానే గుర్తుకొచ్చేది ఏలూరు కాల్వ, బందరు కాల్వ.. నగరానికి అందాన్ని అద్దే ఈ కాల్వలను పట్టించుకున్నవారే లేకపోయారు. కళతప్పి కంపుకొడుతూ అసభ్యకరంగా తయారయ్యాయి.

అయితే ఇప్పుడు చంద్రబాబు దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  ఇప్పటివరకూ బెజవాడ అంటే గుర్తుకువచ్చేది ఇంద్రకీలాద్రి, ప్రకాశం బ్యారేజీ... కానీ  ఇప్పుడు ఆ ఐడెంటిటీ మార్చేయబోతున్నారు. కెనాల్స్ సుందరీకరణతో విజయవాడ రూపురేఖలు మారిపోతున్నాయి. తనిఖీల్లో భాగంగా కాల్వల సుందరీకరణపై బాబు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

పట్టిసీమ నీటిని నగరంలోని కాల్వల్లోకి మళ్లించే అంశంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. విజయవాడ వచ్చిన వారెవరైనా వీటిలో ప్రయాణించాలనేలా చేయబోతున్నారన్నమాట సీఎం. మొత్తానికి చంద్రబాబు బుర్రలో పెద్దఆలోచనలే ఉన్నాయన్నమాట. ఆయన అనుకున్నది చేస్తారు. అంటే విజయవాడకు మంచి కాలం ముందుందన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: