చైనా వ్యతిరేకులకు నోబుల్ బహుమతి యివ్వరాదు: గ్లోబల్ టైమ్స్





ఏకపార్టి పాలన ఉన్న చైనాలో అధినాయకత్వం చెప్పిందే వేదం. అలాంటి రాజ్యము లో ప్రజల బాగోగులనే ప్రశ్నే ఉదయించదు. ప్రజాసామ్య హక్కులకు అక్కడ అవకాశమే లేదు. ఎవరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించరాదు. ఒక వేళ ఎవరైనా ఎదిరిస్తే వారి మరణం ఎలా సంభవిస్తుందో వారికి తెలియదు. అలాంటి చైనా ఎదుటి వారిని వేలెత్తి చూపటానికి కూడా వెరవదు. 




తమ తమ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు అందజేసే నోబెల్ పురస్కారాన్ని రద్దు చేయాలని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వాదించింది. ఈ పురస్కారం మంజూరులో రాజకీయాలు ఎక్కువయ్యాయని, విజేతల్లో ఎక్కువ మంది యూరప్ లేదా అమెరికా వాళ్లుండటమే ఇందుకు నిదర్శనమని వాదించింది.


చైనాలో హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి నిర్బంధాన్ని ఎదుర్కొన్న నోబెల్ గ్రహీత "లియు జియబో" ఈనెల 13న మరణించిన నేపథ్యంలో ఈ వ్యాసం ప్రచురితమైంది. "లియు" శాంతి దూత కాదని, యుద్ధ పిపాసి అని డ్రాగన్ నిందించింది. పాశ్చాత్య సమాజం ఉద్దేశపూర్వకంగా ఈ వాస్తవాన్ని విస్మరించిందని విమర్శించింది. చైనా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న "దలైలామా" కు నోబెల్ ఇవ్వడం ద్వారా అవార్డు కమిటీ పొరపాటు చేసిందని ఆక్షేపించింది. 





తియాన్మెన్ స్కేర్ లో 30000 మంది ప్రజాస్వామ్యం కోసం నినదించిన యువ విద్యార్ధులను అతి సునాయాసంగా కాల్చి మట్టు బెట్టిన ఈ చైనా దురాగతాన్ని ఈ గ్లోబల్ టైమ్స్ ఎన్నటికీ ప్రశ్నించదు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: