సినారె మృతి సినీ, రాజకీయ,సాహితీ రంగాలకు తీరని లోటు..!

Edari Rama Krishna

తెలుగు ఇండస్ట్రీలో  ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సి.నారాయణ రెడ్డి మరణంతో తెలుగు సినీ, సాహితీ ప్రపంచంలో విషాదం నెలకొంది. తెలుగు భాష‌కు కొత్త వెలుగులు అద్దిన మ‌హాక‌వి, జ్ఞాన‌పీఠ అవార్డు గ్రహీత డాక్ట‌ర్ సి. నారాయ‌ణ‌రెడ్డి క‌న్ను మూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతు న్నారు. సోమవారం తెల్లవారుజామున సినారె తీవ్ర అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించే లోపే సినారె కన్నుమూశారు.  


ఈ మద్య ప్రముఖ దర్శకులు దాసరి మృతి నుంచి ఇంకా తేరుకోని తెలుగు చిత్ర రంగం ఇప్పుడు మరో మహాకవిని కోల్పోవడం ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది.  ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  ఢిల్లీ లో ఉన్న నాకు సుప్రసిద్ధ కవి డా.సి.నారాయణ రెడ్డి పరమపదించారన్న వార్త తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను.


తెలుగు సాహితీ వనంలో ఆయనో వట వృక్షం . నాకు గురుతుల్యులు, స్ఫూర్తి ప్రదాత ఆయన. సినారె గ సుప్రసిద్ధులైన ఆయన మరణం సినీ, రాజకీయ,సాహితీ రంగాలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ని తెలియ జేస్తున్నాను. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: