"కృష్ణమ్మ" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి 5 గురు స్టార్ డైరెక్టర్స్..!

Pulgam Srinivas
టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ తాజాగా కృష్ణమ్మ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.
 


ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ వేదికను ఖరారు చేయడం మాత్రమే కాకుండా ఈ ఈవెంట్ కు ఎవరు ముఖ్య అతిధులుగా రాబోతున్నారు అనే విషయాలను కూడా అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ వివరాల్లోకి వెళితే ... ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మే 1 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాదు లోని హైటెక్ సిటీ లో ఉన్న ట్రైడెంట్ హోటల్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.

అలాగే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ లు అయినటువంటి అనిల్ రావిపూడి , కొరటాల శివ , ఎస్ ఎస్ రాజమౌళి , సుకుమార్ , గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా రానున్నట్లు కూడా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇలా ఐదుగురు టాప్ టాలీవుడ్ డైరెక్టర్స్ ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా రానున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించడంతో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా కొరటాల శివ సమర్పణలో విడుదల కాబోతోంది. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: