అఫ్గాన్ పై భారత్ ప్రభావానికి పాక్ వణికి పోతోంది




అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ అమెరికన్ కాంగ్రెస్‌కు "ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ ప్రభావాన్ని చూసి పాకిస్థాన్ వణుకుతోందని" తెలిపింది. అయితే ఆఫ్ఘనిస్థాన్‌ పై భారత్ ప్రభావాన్ని పాకిస్థాన్ ఎలాంటి పరిస్థితుల్లో కోరుకోవడం లేదని, ఈ విషయంలో భారత్‌ చర్యలను నిలువరించేందుకు పాకిస్థాన్ చైనా సహకారం కోసం ప్రయత్నిస్తుందని పేర్కొంది. 


ఆఫ్ఘనిస్థాన్ కోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండడంపై మీడియా ఆసక్తిగా గమనిస్తోంది. ఇటీవల రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆడం కింజింగర్ మాట్లాడుతూ పాకిస్థాన్‌ లోని ఉగ్రవాద స్థావరాలపై వాయు దాడులకు దిగాలని ప్రభుత్వానికి సూచించారు. అమెరికా మిలటరీ అధికారులు, సిబ్బందిపై ఉగ్రవాదులు దాడులకు దిగితే అలాగే చేయాలని అమెరికా కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది.


 
మరోవైపు అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఒంటరి కావడం, అమెరికాతో భారత్ సంబంధాలు రోజు రోజుకు బలపడుతుండడంపై పాకిస్థాన్ చాలా ఆందోళనగా ఉన్నట్టు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ "డాన్ కోట్స్" తెలిపారు. డాన్ కోట్స్ 12 కు పైగా గూఢచార సంస్థలకు నేతృత్వం వహిస్తున్నారు. ఆయన సేకరించిన సమాచారం అత్యంత విలువైనదని భావిస్థారు.  అంతర్జాతీయంగా ఒంటరిదైన పాకిస్థాన్, తన మిత్రదేశం, భారత్ శతృదేశం  అయిన చైనా వైపు సహకారం కోసం తిరిగే అవకాశం ఉందని, డాన్ కోట్స్ యుఎస్ కాంగ్రెస్ ను హెచ్చరించినట్లు పేర్కొన్నట్టు "డాన్" పత్రిక తెలిపింది.


 
ఉగ్రవాదులను అణచి వేయడంలో పాకిస్థాన్ అత్యంత ఘోరంగా విఫలమైందని, దీనివల్ల ఉగ్రవాదులు అక్కడ మనుగడ సాగించడమే కాకుండా భారత్, ఆఫ్ఘనిస్థాన్‌లలో దాడులకు కుట్ర పన్నుతున్నారని డాన్ కోట్స్ పేర్కొన్నారు. 


డిఫెన్స్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, లెఫ్టినెంట్ జనరల్ విన్సెంట్ స్టివార్ట్ మాట్లాడుతూ పాకిస్థాన్ కూడా ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి, భద్రత, సుస్థిరత కావాలని కోరుకుంటోందని, అయితే అదే సమయంలో ఆ దేశంపై భారత ప్రభావాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోం ద ని తెలియజేశారు. ఒకవేళ ఆఫ్ఘనిస్థాన్ కనుక సహకారం కోసం భారత్ వైపు చూస్తే ఉగ్రవాదులు ఆ దేశాన్ని స్థిమితంగా ఉండ నీ యరని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టు కూడా డాన్ పత్రిక పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: