ఇక జియోకు... ఆ 3 కంపెనీలు చుక్కలు చూపించేస్తాయా..?

Chakravarthi Kalyan
మొబైల్ రంగంలో మోనోపలీ కోసం రియలన్స్ సంస్థ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రియలన్స్ జియోను ప్రారంభించింది. ఇప్పుడు జియో అంటే తెలియని వారు చాలా అరుదు. దాదాపు 3 నెలలపాటు అస్సలు బిల్లు కట్టే పని లేకుండా చేసిందీ ఫోన్ కంపెనీ.. ఇక జియో దెబ్బకు మిగిలిన టెలికాం సంస్ధలు కూడా ధరలు తగ్గించక తప్పలేదు. 



జియోకు గట్టి పోటీ ఇస్తున్న ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా త్వరలోనే ఎఈటీ సర్వీసు ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నాయి. తమ వినియోగ దారులు దారి మళ్లకుండా ఉండేందుకు టెలికాంసంస్థలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం తప్పనిసరి కదా. ఇప్పటికే ఎయిర్‌టెల్ ముంబై, ఢిల్లీలలో వీవోఎల్‌టీఈ సర్వీసులకు కమర్షియల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. 


దీన్ని త్వరలోనే దేశమంతా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఎల్టీఈ సేవల ద్వారానే జియోకు అడ్డుకట్ట వేయవచ్చని ఈ మూడు కంపెనీలు భావిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి వీవోఎల్‌టీఈ సర్వీసులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. జియో తరహాలోనే కాకుండా మరి కాస్త ఎక్కువ సాంకేతికతతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 



ఈ నాలుగు టాప్ కంపెనీల్లో దేని వ్యూహం ఫలించినా ఫలించకపోయినా.. సేవలు వినియోగదారునికి చౌకగా లభించాలన్న లక్ష్యం మాత్రం నెరవేరుతుంది. కంపెనీల మధ్య ఈ పోటీ ఎప్పుడూ వినియోగదారుడికి మేలు చేస్తూనే ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: