శ్యామలదేవి: ఆ పార్టీకి ప్రచారం చేస్తున్న కృష్ణంరాజు భార్య.. ప్రభాస్ కూడా..!!

Pandrala Sravanthi
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుననా కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింత హొరెత్తిస్తున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక ఈ చివరి నిమిషంలో ప్రజలను ఆకట్టుకునేందుకు వస్తు,ధన రూపేనా వారికి కానుకలు ఇస్తూ వారి పార్టీలకు ఓట్లు వేసేలా చూసుకుంటున్నారు.అయితే ఎన్నికలు ఉన్నాయి అంటే వారికి సంబంధించిన చాలామంది వచ్చి ప్రచారంలో మునిగి తేలుతారు.అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు వచ్చి ప్రచారం చేయడం ట్రెండ్ గా మారిపోయింది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురంలో చాలామంది సెలబ్రిటీలు వచ్చి పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేశారు. 

అయితే ఈ విషయం పక్కన పెడితే తాజాగా కృష్ణంరాజు భార్య ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి టిడిపి కూటమి కి మద్దతుగా నిలిచి ఆ పార్టీ తరఫున నరసాపురంలో కూటమి అభ్యర్థిగా నిలబడిన భూపతిరాజు   శ్రీనివాస వర్మ కి సపోర్ట్ గా ప్రచారం చేసింది. అయితే శ్రీనివాస్ వర్మ చాలా కాలంగా బిజెపిలో కీలక నాయకుడిగా ఉన్నారు. అలాగే పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ సీటు ఈయనకు కేటాయించింది. అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవిని ఇప్పటికే వైసిపి పార్టీ వాళ్లు నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించి అక్కడి నుండి పోటీ చేయమని బ్రతిమిలాడినా కూడా మీలాంటి ప్రజలకు అన్యాయం చేసే పార్టీతో కలవను అని చెప్పిందట. అయితే ఈమె వైసిపి కి ఆపోజిట్ గా టిడిపి కూటమికి మద్దతు పలికినట్లు ప్రకటించింది.

 అయితే ప్రస్తుతం ఈ మ్యాటర్ కాస్త మీడియాలో వైరల్ అయ్యేసరికి ప్రభాస్ మద్దతు కూడా బీజేపీకేనా.. అందుకే గత కొద్ది రోజులుగా బీజేపీ వాళ్లు ప్రభాస్ ని తెగ పొగిడేస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే గత ఏడాది విడుదలైన ఆది పురుష్ సినిమాని బీజేపీ వాళ్లు హైలెట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మద్దతు బిజెపికి ఉన్నప్పుడు ప్రభాస్ మద్దతు కూడా బిజెపికే ఉంటుందని కొంతమంది ఆయన అభిమానులు భావిస్తున్నారు.మరి శ్యామల దేవి ఒక్కరేనా లేక ప్రభాస్ కూడా చిరంజీవి లాగే ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనకొండా  తన సోషల్ మీడియా ద్వారా బిజెపికి సపోర్ట్ ఇస్తున్నట్లుగా ఏదైనా పోస్ట్ పెడతారా చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: